ఈనెల 30న బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పాటు
తెలంగాణ :హైదరాబాద్ బీసీ కుల జనగణన – స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంపు పై ఈనెల 30న జూబ్లీహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు బీసీ-ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ ఇంట్రడక్షన్ ఫోరం కన్వీనర్ లు విశ్రాంతి ఐఏఎస్ అధికారి చిరంజీవి, ప్రొఫెసర్ తిరుమలి, ప్రొఫెసర్ సింహాద్రి, తెలియజేశారు. రేపు జరుగు సమావేశానికి తెలంగాణలో ఉన్న బిసి సంబంధించిన రాజకీయ నాయకులు, బీసీ వర్గాల నాయకులు ఆహ్వానింపబడు తున్నారని వక్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సూర్యారావు, డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్, బీసీ బడి కెవి గౌడ్,చామకూర,రాజు, ప్రొఫెసర్ తడక యాదగిరి, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ మాలి కరుణాకర్ పటేల్ ,లోకేష్ మొదలైన వారు పాల్గొన్నారు.