మున్నూరు కాపులు సంఘటితంగా ముందుకు సాగాలి….గుండాల కృష్ణ

0

ఖమ్మం:మున్నూరుకాపు కులస్తులు సంఘటితంగా ముందుకు సాగాలని ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్, ఎస్.బి.ఐ.టి. ఆర్జేసి విద్యా సంస్థల అధినేత గుండాల కృష్ణ పిలుపు నిచ్చారు.తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల మున్నూరుకాపు ఉద్యోగులు,రైటైర్డ్ ఉద్యోగుల ఈసి సమావేశం హైదారాబాద్ లో జరిగిoది.ఈ సమావేశానికి కృష్ణ అతిధి గా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరుకాపు కులస్తులు బీసీ కులాల వారిని కూడా కలుపుకొని కులస్తుల అభివృధ్ధికి పాటుపడాలని సూచించారు.సమస్యలతో వచ్చే ఉద్యోగుల,విశ్రాంత ఉద్యోగులకు అండగా నిలవాలని సూచించారు.ప్రతీ ఒక్కరూ చైతన్యం పెంపొందించుకుని సామాజికంగా,రాజకీయంగా,ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని అన్నారు.అదేవిధంగా ఎదురయ్యే అసమానతలను ఎదురించి ముందడుగు వేయాలని అన్నారు.కులబాందవులకు తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని చెప్పారు.అనంతరం సంఘం రాష్ర్ట కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో సంఘం రాష్ర్ట అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ బాల శ్రీనివాసరావు పటేల్,ఇట్యాల వెంకట కిషన్ పటేల్,జిల్లా అధ్యక్షులు,పెదబోయిన నాగరాజు, కోశాధికారి, అచ్యుత రావు, జిల్లా నాయకులు కర్నాటి సోమయ్య సుధాకర్,రంగా నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *