ఆగస్టు 10,పుంజాల శివశంకర్ వేడుకను నిర్వహించాలి
రాజకీయ కురవృద్ధులు, ప్రముఖ సామాజికవేత్త, అభినవ విజ్ఞాన సంబోధకులు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మళ్ళీ జన్మించిoడు
– వీరప్ప మొయిలీ,మాజీ ముఖ్యమత్రి కర్ణాటక ,మాజీ కేంద్ర మంత్రి .(అదొక్కటే ముగింపు)- భారత సామాజిక న్యాయ శిఖరం,బీసీ రిజర్వేషన్స్ ప్రదాత ,మాజీ కేంద్ర మంత్రి , గవర్నరు, జస్టిస్ పుంజాల శివశంకర్ ఆత్మకథ మొదటి భాగం రవీంద్రభారతిలో ఆవిష్కరణ సభలో శివశంకర్ గురించి… కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మత్రి వీరప్ప మొయిలి వారి వ్యాఖ్యలు,1986 లో ఇండియా టుడే పత్రిక రాసిన కవర్ పేజీ కథనంలో ఈ కింది విధంగా రాసింది.పుoజాల శివశంకర్ తో కలిసి పనిచేసిన మరొక సివిల్ సర్వెంట్ ఇలా గుర్తుచేసుకున్నాడు… చాలా సంధర్భాలలో కేబినెట్ కార్యదర్శి, హోం కార్యదర్శి, అతని కార్యాలయంలో ఉన్న ఇతర సీనియర్ అధికారులు శివశంకర్ నుండి ఐఏఎస్ అధికారులు డిక్టేషన్ తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ అంటే – దేశములో ఉండే బ్యూరోక్రాట్స్ (ఉద్యోగవర్గం) లో ఇదే పెద్ద అర్వత.చిన్న వయసులో ఐఏఎస్ సాధించి ఎంతో నిజాయితీగా,నిబద్ధతతో పనిచేసిన వారికి మాత్రమే తమ సర్వీస్ చివరి దశలో ఈ పోస్ట్ వస్తుంది. అటువంటి కేబినెట్ సెక్రటరీ , హోం సెక్రటరీ అదృష్టంగా ఒక రాజకీయ నాయకుడు ప్రభుత్వ ఆదేశాలు , Directives విషయములో తను స్వయంగా డిక్టేశన్ ఇచ్చి రాయించడం అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచములోనే అరుదైన సంఘటన. బహుశ: ఈ సందర్భం ప్రపంచ చరిత్రలో ఎక్కడ విని ఉండం.చూసి ఉండం.అంతటి ప్రపంచ మేధావి పుంజాల శివశంకర్ . వారి జయంతి ని ఈ ఆగష్టు 10 న గొప్పగా నిర్వహించి ఘనమైన నివాళి అర్పిద్దాం.వారి ఆశయ సాధనకై ప్రతిజ్ఞ తీసుకుందాం. దీనికోసం మండల నుండి జిల్లాల రాష్ట్ర స్థాయిలలో వీధి కార్యక్రమం నిర్వహించాలని కోరుతున్నాం.