తెలంగాణ :మరపురాని జ్ఞాపకం.. తెలంగాణ ముద్దు బిడ్డ హీరో పైడి జయరాజ్ 115 వ జయంతి కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు. అభియుక్తికి నిలువెత్తు నిదర్శనం పైడి జయ రాజ్ వీరి 115వ పుట్టినరోజు సందర్భంగా స్మరించుకుంటూ..తెలంగాణ ముద్దు బిడ్డ హీరో పైడి జైరాజ్ తొలితరం బాలివుడ్ హీరో, దాదాసాహెబ్ పాల్కే పురస్కార గ్రహీత, పైడి జైరాజ్ 115వ జయంతి జైరాజ్ కు ఘన నివాళి అర్పిస్తు మీరు జయంతి ఉత్సవాల సందర్భంగా రేపు రవీంద్రభారతిలో జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. జయరాజ్ కాపు సామాజిక వర్గానికి చెందిన కావడంతో ఆ సామాజిక వర్గానికి ఒక ఐకాన్ గా మిగిలారు. జయరాజ్ ఎన్నో చిత్రాలతో ఆరంభమైన పైడి జైరాజ్ నట ప్రస్తానం నటుడు, దర్శకుడు, నిర్మాత, జయరాజ్ ప్రధానంగా హిందీ, మరాఠీ , ఒరియా, బెంగాలి, పంజాబీ, కొంకిణి గుజరాతీ మలయాళం భాషలలో సుమారు 700 చిత్రాలలో నటించి చరిత్ర సృష్టించారు. భారతీయ చలన చిత్ర చరిత్రలో సుధీర్ఘ కాలం వెండితెరపై వెలిగిన ఘనమైన చరిత్ర జైరాజ్ ది. 1995 లో “గన్ అండ్ గాడ్” ఆయన 86 ఏళ్ళ వయసులో నటించిన చివరి చిత్రం. సుమారు భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తో జైరాజ్ ను ప్రభుత్వం గౌరవించుకొంది. పైడి సుందర రాజు, పైడి దీనదయాళ్ జైరాజ్ కు అన్నయ్యలు.సినిమా వారసత్వం అసలే లేని తెలంగాణ నుంచి జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన కిరీటం. రేపు జరుగు తెలంగాణ కళాకారులతో పాటు సామాజిక వర్గానికి చెందిన కార్యక్రమానికి హాజరవ్వాలని తెలిపారు.