ఆంధ్ర బిజెపి ఎన్నికల ప్రతినిధిగా పి సి మోహన్
కర్ణాటక : ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక కోసం భారతీయ జనతాపార్టీలో ముఖ్య నాయకుడు. ప్రస్తుతం బెంగుళూరు సెంట్రల్ లోక్ సభ సభ్యునిగా ఉన్న ఎంపీ పి సి మోహన్ ను ఆంధ్రప్రదేశ్ బిజెపి ఎన్నికల అధికారిగా భారతీయ జనతా పార్టీ తాజాగా నియమించింది. వీరి నేతృత్వంలో రాష్ట్రంలో విశేషంగా పర్యటించి సమర్ధుడైన వారిని బిజెపి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని. ఆశాభావంతో జాతీయ కమిటీ నిర్ణయించి కర్నాటకకు చెందిన బలిజ నాయకుడు పి.సి.మోహన్ ను నియమింప చేశారు. వీరు1963 జూలై 24న బెంగళూరులో పి.చిక్కముని స్వామప్ప,పి.సి.రామక్క దంపతులకు జన్మించారు. కర్ణాటకలోని బెంగుళూరులోని విజియా కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.వివాహం 27-అక్టోబర్-1991న శైలాతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు,ఒక కుమార్తె ఉన్నారు. పి.సి.మోహన్ గొప్ప వ్యాపారవేత్త పేరు సంపాదించుకొని తన శేష జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలని ఇలా తన జీవితాన్ని.రాజకీయ ప్రస్తావనంలో….పి.సి.మోహన్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకియలోకి అడుగెడుతూ ఆ పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999 శాసనసభ ఎన్నికల్లో చిక్‌పేట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డిపి శర్మపై 20,636 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వీరు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ స్వామిపై 2237 ఓట్ల మెజారిటీతో గెలిచి తిరిగి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి హెచ్.టి సాంగ్లియానాపై 35,218 ఓట్ల మెజారిటీ తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో అడుగుపెట్టి పట్టణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, కాయిర్ బోర్డు సభ్యుడిగా, ఇతర వెనుకబడిన తరగతుల (OBCలు) సంక్షేమ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. దీంతోపాటు2014లో కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్‌ను 1,37,500 ఓట్ల తేడాతో ఓడించి రెండోసారి కూడా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో 1సెప్టెంబర్ 2014 నుండి 25 మే 2019 వరకు హౌసింగ్, పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కొనసాగారు.15 సెప్టెంబర్ 2014 – 25 మే 2019 వరకు పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీమ్ (MPLADS) సభ్యులపై కమిటీ సభ్యుడిగా, పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా పని చేశారు.పి.సి.మోహన్ 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థి రిజ్వాన్ అర్షద్‌పై 50,000 ఓట్ల మెజారిటీ గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా,హౌసింగ్, పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, అలాగే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా,ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ సభ్యుడిగా పని చేశారు. గత 2024లో కాంగ్రెస్ అభ్యర్థి మన్సూర్ అలీ ఖాన్ పై 32707 ఓట్ల తేడాతో ఓడించి నాలుగవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వీరికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో సన్నిహిత సంబంధాలు కూడా దండుగా ఉన్నాయి.