ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటీవల అకాల వర్షాలు కురిశాయి, వాటి వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయంలో తన సొంత ఖర్చులతో నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలను, అలాగే ఏపీ గ్రామ పంచాయితీలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున దాదాపు 400 పైగా గ్రామ పచాయతీలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ తన సొంత గ విరాళంగా అందజేశారు, అలాగే వీరితోపాటు మెగా ఫ్యామిలీ నుండి రామ్ చరణ్ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకు కోటి రూపాయలు చొప్పున రెండు కోట్లు ప్రకటించినరు. సినీ రంగంలో వెలుగుతున్న మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సహాయ నిధులు ప్రకటించినట్లు తెలిపారు.