మున్నూరు కాపు బోనాల కార్పొరేటర్ శ్రీవాణి హాజరు
హైదరాబాద్ మున్నూరుకాపు సంక్షేమ సంఘం దిల్షుక్నగర్ ఎల్బీనగర్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున కొత్తపేట కిల మైసమ్మ టెంపుల్ దగ్గర మున్నూరు కాపు కుల సంఘ నాయకుల ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించినారు ఈ కార్యక్రమంలో సరూర్నగర్ స్థానిక కార్పొరేటర్ శ్రీమతి ఆకుల శ్రీవాణి కార్యక్రమానికి విచ్చేసినారు. తెలంగాణలో అమ్మవారికి బోనాలు సమర్పించడం ముఖ్యమైన పండుగగా భావిస్తారు.అదే భాగంగా తమ సామాజిక వర్గానికి చెందిన మున్నూరుకాపులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా భావించారు. ఈ కార్యక్రమంలో కాపు వికాసం పత్రిక సంపాదకులు మాలి కరుణాకర్ పటేల్ సంఘం గౌరవ అధ్యక్షులు తోటరాజు, పులిపాటి త్రివేది, ఎక్క రమేష్ రావు ఆరే క్రాంతి, ప్రధాన కార్యదర్శి నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.