మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో బీసీ యుద్ధభేరి పోస్టర్ ఆవిష్కరణ

0

హనుమకొండ జిల్లా:భూమి నుండి వ్యవసాయం సాగుచేసి పదిమందికి అన్నం పెట్టే వాడే రైతు అలాంటి రైతు కుటుంబంలో జన్మించడం మన మున్నూరుకాపులకు దేవుడిచ్చిన వరంగా భావించుకోవాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోదరుడు చింతపండు వెంకటేశ్వర్లు పటేల్ తెలిపారు. గురువారం సాయంత్రం హనుమకొండ జిల్లా మున్నూరుకాపు వాడలో మాత గార్డెన్ లో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో ఫిబ్రవరి 2 జరుగు బీసీ యుద్ధభేరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం బీసీ రాజ్యాధికోసం పోరాటం చేస్తున్న మల్లన్నకు తెలంగాణలో ఉన్న బీసీ కుల సంఘాలు పూర్తి మద్దతు తెలుపుతున్నారనీ మనం కూడా మన కుల పరంగా వారికి మద్దతు తెలియజేయాలని వెంకన్న తెలియజేశారు.బీసీ ఉద్యమంలో తన హక్కులను సాధించుట కోసం ధైర్యంగా నిలబడిన వాడే నిజమైన మున్నూరు కాపు బిడ్డలని రీసెర్చ స్కాలర్ వక్త డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్లు సభలో తెలియజేశారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో 24 శాతం ఉన్న మున్నూరుకాపులం ఇట్టి సమావేశానికి సరిగా హాజరు కాకపోవడం చాలా సిగ్గుచేటని, జిల్లా సంఘం నాయకుల నాయకత్వం లోపమని   ఎంకే పటేల్ న్యూస్ ఎడిటర్ మాలి కరుణాకర్ పటేల్ వ్యక్తం చేశారు. సంఘంలో నాయకత్వం వహిస్తున్న వారు పార్టీలకతీతంగా సంఘాన్ని నడపాలని గుర్తు చేస్తూ ఒకవేళ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు వారి స్వార్థం కోసం కులాన్ని రాజకీయంగా వాడుతున్న ప్రతినిధులకు భయపడడం సిగ్గుచేటని ఆరోపిస్తూ అలాంటి వారు సంఘం పదవులను వీడనాడి సామాన్య జీవితం గడుపుకోవాలని సభముఖంగ గుర్తు చేశారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కాపు సంఘ నాయకులు విశ్రాంతి ప్రధాన ఉపాధ్యాయుడు పూజారి సత్యనారాయణ పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపులు బీసీలుగ ఉన్నప్పటి కూడా వారికి ప్రభుత్వ పరంగా అందే రిజర్వేషన్లతో వెనుకబడి పోవడం వాటి హక్కుల కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మన మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వాడుగా అదృష్టంగా భావిస్తూ వారికి ఫిబ్రవరి 2 జరుగుతున్న బీసీ యుద్ధభేరి సభకు మున్నూరుకాపు సంఘం తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మాందాటి మహేందర్,బక్కీ యాదగిరి,దామరశెట్టి ఉత్తరయ్య, పెరికారి శ్రీధర్,కేడల,ప్రసాద్, నీలారపు శ్రీనివాస్,బండారు రవీందర్, బక్కి రాజకుమార్, దోరం ఆనంద్, మెట్టు సురేందర్, అల్లం రాజకుమార్, నరసయ్య, సారంగపాణి, ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగస్తులు, ములుగు, జనగాం, హనుమకొండ జిల్లాల నుంచి మున్నూరుకాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *