ఆనాడు తండ్రి తరం ఏమిటి…ఈనాడు కొడుకుల తరం ఏమిటి?

తండ్రి అనుభవాన్ని చెబుతూ…. మీ తరము వారు ఈ రోజుల్లో ఎలాగైతే ప్రార్ధన లేకుండా.. మర్యాద లేకుండా,ప్లానింగ్ లేకుండా క్రమశిక్షణ లేకుండా..పెద్దల ఎడల గౌరవం లేకుండా..మన సంస్కృతి, చరిత్ర పై అవగాహన లేకుండా..కుటుంబ విలువలపై ఏ మాత్రం పట్టింపులు లేకుండా..రోజులు ఎలా గడిపేస్తున్నారో! చూడండి. మేము మీలాగా.. ఏ సహకారం లేకున్నాను.. అన్నీ పాటిస్తూ ఆనందంగా జీవించాము…వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు,పాఠశాల వేళలు అయిన తరువాత చీకటి పడేదాకా ఆడుకున్నాము. అప్పుడు మాకు ఎలాంటి కరెంటు లేకుండా ఉండేది. టీవీ లు సెల్ ఫోన్లు చూడలేదు…ఇంటర్నెట్ స్నేహితులతో కాక నిజమైన స్నేహితులతో గడిపాము.
దాహం వేస్తే కుళాయి నీరు, బావి నీరు త్రాగాము.బాటిల్ నీరంటే ఏమిటో మాకు తెలియదు. డబ్బులు పెట్టి కొనుక్కోలేదు… అందరము ఒకే గ్లాస్ లో జ్యూస్ త్రాగినా,కాకి ఎంగిలి చేసిన జామకాయలు తిన్నా మాకెప్పుడూ ఎలాంటి జబ్బులు రాలేదు. అమ్మ చేసిన మామిడికాయ పచ్చడి తో చేతు ముద్దలు తిన్నాము. అన్న అక్క తిన్న అన్నంను మేము తినేవాళ్ళం.మూడు పూటలా అన్నమే తిన్నా మాకు ఊబకాయం, బిపి, షుగర్లు, థైరాడ్ లాంటి జబ్బులు రాలేదు.
షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తిన మాకు కీళ్ళ నొప్పులు రాలేదు. స్లీపర్సన్ మాత్రమే వేసుకునే వాళ్ళం.సొంత ఆట వస్తువులు తయారు చేసుకొని ఆడుకున్నాము, అష్టా చెమ్మా, ఏడు పెంకులు, కోతి కొమ్మచ్చి, వైకుంఠ పాళీ, దొంగ పోలీస్, సిర గోనె, గోలీలాట, ఆడుకున్నాము. బంధువులతో కలసి మెలసి ఆనందంగా ఉన్నాము,పిలువక పోయినా స్నేహితుల ఇండ్లకు వెళ్లి వారి చేసిన పదార్థాలను తిన్నాము.మావి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలే, స్నేహితులతో పెళ్లి ఫోటోలు తీసుకునే వాళ్ళం, స్నేహితుడి పెళ్లి అవుతుంటే దాదాపు పది రోజుల వరకు వాల్ ఇంట్లోనే ఉండేవాళ్ళం….అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి.బహుశా మా తల్లిదండ్రులు చెప్పింది ఆచరించిన చివరి తరం మేమే….మా వారసులు శాసించినది.పాటించే మొదటి తరమూ మాదే కావచ్చు అయినప్పటికీ మీ యాంత్రిక జీవితానికి యధాశక్తి సహాయ పడుతున్న వాళ్ళము. మేము ఒక పద్ధతిలో ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్ళము. అందుకే మా విన్నపము ఏమంటే భూమి పైనుండి మేము వెళ్ళిపోకముందే మా జీవితాలనుండి, ఎంతో కొంత మానుండి మీరు నేర్చుకోండి.మమ్మల్ని చక్కగా పెంచిన మంచి తల్లిదండ్రులకు వందనాలు, మేము అలా పెంచడం చేతకాని ఈ సమాజంలో,
ఓడిపోయిన మొదటి తరం తల్లి,దండ్రులం అవుతున్నాం. ఈ తరంబాగు దీని తప్పక పాటించండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రేపు మీ పిల్లలకు కూడా మిమ్ములను కూడా…. ఈ విధంగా…?