తెలంగాణ హైదరాబాద్:గజ్వేల్ నియోజకవర్గంలోని అహ్మదీపూర్ గ్రామానికి చెందిన శతాధిక మాతృమూర్తి ఆకుల ఐలమ్మ (102) బుధవారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో కన్నుమూశారు. రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు ఆకుల రాజయ్య తల్లి గారైన ఐలమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పటికీ, గత వారం రోజులుగా మారిన వాతావరణ పరిస్థితులు,ప్రభావంతో తీవ్రమైన చలి గాలులతో గత వారం రోజుల క్రితం స్వల్ప అస్వస్థతకు గురై ఇంట్లోనే చికిత్స పొందుతూ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం ఉదయం 11 గంటలకు తుది శ్వాస విడిచారు. ఐలమ్మ అంత్యక్రియలు గురువారం ఉదయం 11 గంటలకు స్వస్థలం అహ్మదీపూర్ లో జరుగుతాయని కుటుంబీకులు తెలియజేశారు.ఐలమ్మ మరణం పట్ల… బిజైపి కేంద్ర మంత్రులు బండి సంజయ్,జి.కిషన్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు డాక్టర్ కోవ లక్ష్మణ్,బిఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర,మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తోపాటు కాపు వికాసం పత్రిక, ఎంకే పటేల్ న్యూస్, సంపాదకులు మాలి కరుణాకర్ పటేల్, రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సర్దార్ పుటం పురుషోత్తం రావు పటేల్, కొండ దేవయ్య పటేల్, పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, సీనియర్ జర్నలిస్టు గోపాల బాలరాజు పటేల్ తదితరులు సంతాపం తెలుపుతూ ఆకుల రాజయ్యను ఫోన్లో పరామర్శించారు.హైదరాబాద్ నగరంతో పాటు, వివిధ ప్రాంతాల నుంచి అహ్మదీపూర్ వచ్చిన అన్ని పార్టీల నాయకులు, పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులు, డాక్టర్లు, అడ్వకేట్లు, మున్నూరుకాపు సంఘం నాయకులు..తల్లి మరణంతో శోక సముద్రంలో ఉన్న ఆకుల రాజయ్యను కలిసి,పరామర్శించి, వారిని ఓదార్చారు.