బీసీల గురించి వ్యాసకర్త మంగళారపు లక్ష్మణ్
హైదరాబాద్, ప్రత్యేక ప్రతినిధి:బిసి ఇంటలెక్చువల్ సదస్సు ఒక మంచి తొలి మెట్టు, సమావేశం ఆద్యంతం అర్థం వంతంగా, నిండుగా, అందరినీ మెప్పించి మేల్కొల్పే విధంగా జరిగింది, హైదరాబాద్ తాజ్ కృష్ణ సెవెన్ స్టార్ హోటల్లో జరగడం బీసీలను పది మెట్లు పైకి ఎక్కించడం లాంటిదే,మేము బీసీలము కాదు అగ్రవర్ణాలకు సరి సమానమని చెప్పే గొప్ప ప్రయోగం,మేము ఎందులోనూ ఎవరికి తక్కువ కాదు, ప్రతి ఒక్క బీసి బిడ్డ కి ఆత్మవిశ్వాసం పెంచేలా చేశారు,రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఆయా నగరాల నుండి వివిధ కులాలకు సంబంధించిన బిసి కుల మేధావులు, ఆయా కుల సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరు కావడం శుభ పరిణామం.సభికులలో ప్రసంగించిన వక్తలలో ఎన్నడూ లేని విధంగా ఒక రకమైన కసి, తెగింపు,పట్టుదల,ఈర్ష్య, పోరాట పటిమ స్పష్టంగా కనిపించింది,112 కులాలు,56% జనాభా,80, ఏండ్ల పాలనా, అయినా! అధికారం ఉందని ద్రాక్షే అయ్యింది, ఒక్క బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కాలేకపోయారు,ఇంకా మనం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నo, రెడ్డి,కమ్మ,వెలమా,బ్రహ్మణ,వైశ్యులు రిజర్వేషన్లు ఉంటేనే ముఖ్యమంత్రులు అయ్యారా! 80 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించారా? దురదృష్టం ఏమిటంటే ఉత్తరాది,దక్షిణాది అన్ని రాష్ట్రాల్లో బీసీలు రాజ్యాధికారం చేపట్టినా,నేటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నుండి నేటి తెలంగాణ రాష్ట్రాల్లోనే బీసీ ముఖ్యమంత్రి కాకపోవడం అనైక్యత,పిరికితనం,భయం,అవివేకం,అవగాహన రాహిత్యం,తెలివి తక్కువతనం.ఒక కులం పై మరొక కులానికి అవగాహన లేకపోవడం తదితర అనేక కారణాలు ఉన్నాయి,నేటికీ భూస్వామ్య పెట్టుబడి దారులు, రెడ్డి,దొర, పటేల్ వ్యవస్థ ఇంకా తుడిచిపెట్టుకుపోలేదు, మనవాళ్లేమో,ఎక్కడోచోట అగ్ర వర్ణాలకు లొంగిపోయి ఎన్నికల్లో మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు, బీసీ అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నా అగ్రవర్ణాలకే ఓటేస్తున్నారు,బీసీ మనిషి మారనంత వరకు మన మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది? వచ్చే2029 ని టార్గెట్ చేసుకొని 80 ఏళ్ల చరిత్రను విషదీకరిస్తూ గ్రామస్థాయి నుండి బీసీలను చైతన్యపరిచి అధికారం గుంజుకుంటేనే అన్ని సమకూరుతాయి. సమావేశంలో ఒకరు మాట్లాడుతూ అగ్రవర్ణాల వారంతా పిళ్ళులని మనం ఎలుకల మని వారు తింటూ బలుపెక్కిపోయారన్నారు. తెలిపారు. కానీ కేవలం4%,2%శాతం ఉన్న వారే అంత బలుపెక్కిపోతే,56% శాతం ఉన్న మనకెందుకు బలుపెక్కడం లేదన్న అన్నారు, మనమెందుకు పిళ్ళులం,పులులం, సింహాలము ఎందుకు కాలేకపోతున్నాం,దొరలు భూస్వాములు,రెడ్లు జమీందారులు,జాకీర్దారులు వాళ్లే రాజకీయాల్లోకి వచ్చారు 80 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని వాళ్ల పాలించారు. వాళ్లు బలవకుండా ఎలా ఉంటారు? వాళ్లను ఇప్పటికీ అడ్డుకోలేక పోతున్నామే అదే మన దౌర్భాగ్యం,అగ్రవర్ణాల ప్రభుత్వాలు ఎన్ని అవినీతి అక్రమాలు చేసినా రాష్ట్ర ఖజానాలను దోచుకుని వందల,వేల కోట్లు పోగు చేసుకుంటూ వారు మరింత బలిచిపోతున్నారు. అగ్రవర్ణాల ప్రభుత్వా నీడలో మనవాళ్లు జంకుతు,బొంకుతూ వారి వారి పదవులను కాపాడుకోవడానికి నానాయాతన పడుతున్నారు,ఇక బీసీలేంటి వారి భవిష్యత్తు ఏంటి వారి ప్రణాళిక లేంటో ఎవరికి పట్టవు,చట్టసభల్లో ఉన్న బీసీ నాయకులు ఇకనైనా కళ్ళు తెరిచి బీసీలను ఏకం చేసి 2029 లో రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు పడకపోతే ఇక మన భవిష్యత్తు ప్రశ్నార్థకమే అవుతుంది. మంగళారపు లక్ష్మణ్ పటేల్, వ్యాసకర్త,రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ప్రధాన కార్యదర్శి.(బిసి సభలో పాల్గొని వారి అనుభవాన్ని ఈ విధంగా తెలిపారు. KVK News).