హైదరాబాద్:హైదరాబాదులో ఉన్న బిజెపి పార్టీ ఆఫీసు ఆవరణను గద్దర్ పేరు పెట్టడం అని ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడడం నవ్వొస్తుందని కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. పద్మ అవార్డు విషయంలో గద్దర్ కు ఇవ్వలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం సిగ్గుచేటు అనిపిస్తుంది. కాంగ్రెస్ హయాంలో గద్దర్ పై ఎన్నో కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేసింది ఆ ప్రభుత్వం కాదా? గద్దర్ ను బాగా అవమానించింది కూడా అదే కాంగ్రెస్ ప్రభుత్వం లోనే జరిగింది, బిజెపి కార్యాలయం ఉన్న ఆవరణను గద్దర్ పేరు మార్చడం అన్న చొరవను అదే విషయంలో హైదరాబాదును భాగ్యనగర్ గా, మహబూబ్నగర్ పాలమూరు గా నిజామాబాద్ ను ఇందురు గా దమ్ముంటే మార్చి చూపించాలని బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరినారు.