చంద్రయ్యకు నివాళులు అర్పిస్తున్న పురుషోత్తం పటేల్
*యాదాద్రి జిల్లా: మంచితనానికి మారుపేరుగా సంపాదించిన తన కుటుంబ అభ్యున్నత కోసం శ్రమించిన వ్యక్తి చంద్రయ్య అని కొనియాడుతూ మున్నూరుకాపు రాష్ట్ర అపెక్స్ కమిటీ కన్వీనర్ సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పటేల్ తెలియజేశారు. చంద్రయ్య సామాన్య పేద కుటుంబం నుండి పుట్టి కృషితో అంచలచలగాఎదిగి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మున్నూరుకాపు నిత్యాన్న సత్రం నిర్మాణానికి విశేషంగా కృషి చేసి ఫౌండర్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన గొప్ప మహనీయుడు ఏనుగుల చంద్రయ్య పటేల్ లని అలాగే వీరు ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో పలకరించి వారి యోగక్షేమాలను తెలుసుకోవడం చంద్రయ్య మంచితనమని తెలుపుతు మంగళవారం వారి స్వగ్రామైన యాదాద్రి మండలం, కమటంగూడెం వద్ద చంద్రయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చంద్రయ్య మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు నివాళులు అర్పిస్తున్న మున్నూరు కాపు సంఘ నాయకులు ఆవుల రామారావు పటేల్, కోట శంకర్ పటేల్, కాపు వికాసం పత్రిక సంపాదకులు మాలి కరుణాకర్ పటేల్, బిజెపి నాయకులు చిరిగ శ్రీనివాస్ పటేల్.