సీఎం సహాయనిధి చెక్కును అందజేసిన వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్
కరీంనగర్: ఆరోగ్య సమస్యల విషయమై చికిత్స చేయించుకుని ఆర్థిక సహాయార్థం సీఎం సహాయ నిధిని ఆశ్రయించగా వారికి స్థానిక మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్ వారికి శుక్రవారం రోజున అందజేయడం జరిగినది.దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుండి మంజూరు కాగా,బీసీ సంక్షేమ శాఖ,రాష్ట్ర రోడ్డు రవాణా మంత్రివర్యులు, పొన్నం ప్రభాకర్ వారి ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్ నేరుగా లబ్ధిదారులకు సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు.