సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి హైడ్రా నోటీసులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు ఈరోజు నోటీసులు అంటించారు.మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి నివాసం ఉండగా ఆ ఇల్లు FTL పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.మరో వైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్,నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులో సరైన అనుమతి పత్రాలను చూపాలని తెలుపుతూ ఒకవేళ చూపనియెడల ఈ నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని హైడ్రా స్పష్టం చేశారు.దుర్గం చెరువు FTL పరిధిలో సర్వే నంబర్ 47లో ఉన్న ప్లాట్ నంబర్ 54,55 లలో రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి నిర్మించుకున్న ఇల్లు కొల్లగొట్టే దమ్ముందా? అని కొందరు అభిప్రాయం.