ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన మున్నూరు కాపులు
హనుమకొండ జిల్లా,మున్నూరుకాపు భవన నిర్మాణం కోసం రూ.ఏడు కోట్ల ఐదు లక్షల రూపాయలను మంజూరు చేసి, శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు. మంగళవారం రోజున హనుమకొండ ప్రెస్ క్లబ్ లో కృతజ్ఞతలు తెలియజేశారు.ఇట్టి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపు కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు,నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు..గత 15 ఏండ్ల మున్నూరుకాపు భవన నిర్మాణం కలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నెరవేర్చరని తెలిపారు.ఎన్నికలలో గెలవాలని కులం కార్డు అడ్డు పెట్టుకుని రాజకీయం చేసిన వాళ్లకు బుద్ది చెప్పేలా ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారని చెప్పారు.50 వేల అతి పెద్ద ఓటు బ్యాంకును స్వార్థం కోసం వాడుకున్న గత పాలకులకు చెంప పెట్టు ఉండే విధంగా ఈ ఆరు నెలలో భవనం పూర్తి చేసుకుంటామని చెప్పారు..కాంగ్రెస్ పార్టీ గెలిచిన రెండు ఏండ్ల లోపు అనేక అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు.మున్నూరుకాపు కులాన్ని అడ్డుపెట్టుకొని అధికారం సంపాదించుకొని.నిర్లక్ష్యానికి గత పాలకులు చేశారని ప్రశ్నించారు.ఈ సమావేశంలో కార్పొరేటర్ మానస రాం ప్రసాద్,మాజీ కార్పొరేటర్ నాగరాజు,నాయకులు పవన్ తోట, సురేందర్, లక్ష్మణ్, మనోహర్, సతీష్, పున్నం చందర్,రాజ్ కుమార్, రాకేష్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.