కిలా మైసమ్మకు బోనం సమర్పిస్తున్న మున్నూరు కాపులు

0
రంగారెడ్డి జిల్లా : ఆషాడ మాసంలో అమ్మవారి ఆశీర్వాదం పొందాలని తమ కుటుంబంలో పిల్లాపాపలో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఎంతో ఉత్సాహంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. అలాగే ప్రతి ఏటా దిల్షుక్నగర్ మున్నూరుకాపు సంఘం వారి ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా ఘనంగా గత ఐదు సంవత్సరముల పైబడి రంగారెడ్డి జిల్లా కొత్తపేట మెయిన్ రోడ్డు  ఖిలా మైసమ్మ అమ్మవారికి మంగళవారం ఉదయం మున్నూరు కాపు మహిళలతో బోనం సమర్పిస్తున్నట్లు దిల్షుక్నగర్ మున్నూరుకాపు సంఘం తెలిపారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో స్థానిక మున్నూరు కాపు నాయకులు, రాష్ట్ర అపెక్స్ కమిటీ అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తం పటేల్ ప్రధాన నిర్వాహకునిగా వ్యవహరిస్తూ కమిటీని ఎల్లవేళలా వెన్ను తట్టు ఉంటూ కార్యక్రమాలను చేయుటకు సహకరిస్తుంటారు. దీనిలో భాగంగా తెలంగాణలో ఉన్న మున్నూరు కాపు ప్రజాప్రతినిధులను, ముఖ్యమైన నాయకులను వివిధ శాఖలలో ఉన్నత పదవులను అవరోధిస్తున్న వారిని ఈ కార్యక్రమానికి పిలిపించి  అమ్మవారి ప్రసాదంతో పాటు మంచి చక్కని భోజనం కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటారు. వారిని ఘనంగా సన్మానించడం కూడా జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి హైదరాబాదులో ఉన్న మున్నూరు కాపులు తప్పనిసరిగా రావాల్సి కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు, పులిపాటి త్రివేది పటేల్, తోట రాజు పటేల్, అనంతుల నవీన్ పటేల్, చక్రం నాగరాజు పటేల్, వేణుగోపాల్ పటేల్, మరో ముఖ్య నిర్వాహకులు, ఎక్క రమేష్ పటేల్, ఆరే క్రాంతి పటేల్. తోపాటు సంఘ సభ్యులు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *