అలంపాడు మున్నూరు కాపు గ్రామ కమిటీ ఎన్నిక

0

 

తెలంగాణ, జోగులాంబగద్వాల్ జిల్లా: శనివారం సాయంత్రం శ్రీ తెలుగులోనిపల్లి ఆంజనేయ స్వామిగుడి ఆవరణలో యువత కమిటీ ఎన్నిక జిల్లా మున్నూరుకాపు సంగం కమిటీ ఆధ్వర్యంలో ధరూర్ మండలంలో అలంపాడు గ్రామ  కమిటీని జిల్లా అధ్యక్షులు మేరకు ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.అనంతరం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ ఆలంపాడు మున్నూరుకాపులు ప్రతి ఒక్కరు ఐక్యతతో వుండాలని ఏ సమస్య వచ్చిన కలసికట్టుగా ముందుకు సాగాలని, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఏ సమస్య వచ్చిన మనం అందరం కలిసి పోరాడదామని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు.ధరూర్ జడ్పీటీసీ పద్మవెంకటేశ్వర్ రెడ్డి  మాట్లాడుతూ గత 30 ఏళ్ళుగా ధరూర్ మండలంలో మన మున్నూరుకాపు లకు పట్టం కడుతున్న ప్రతి ఒక్క మున్నూరుకాపు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు, రాబోయే రోజుల్లో కూడా గ్రామ,మండల జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు మొదట ప్రాధాన్యతగా మన కుల కుటుంబసభ్యులకు అన్ని రంగాలలోతో పాటు రాజకీయంగా అవకాశం కల్పించాలని,కోరారు.ఆల్లపాడ్ గ్రామ పెద్దలు,యువత కలసి జిల్లా అధ్యక్షులు జి. వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి నాయకి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్లు జాంపల్లి భారతసింహరెడ్డికి, కాపులకుంట సుధాకర్ రెడ్డి, బుక్ సెంటర్ కిరణ్ కుమార్, సహాయ కార్యదర్శి  ట్రాన్స్పోర్ట్ భాస్కర్ రెడ్డి, కోశాధికారి స్వామికి, కార్యవర్గ సభ్యులు తాటికుంట మధు సంగం పెద్దలు జాంపల్లి వేంకటేశ్వర రెడ్డి గారికి, కౌన్సిలర్ నాయకి జనార్దన్, స్టేట్ యూత్ సెక్రటరీ మలిచెటీ ఆనంద్ రెడ్డి, బిల్డర్ మల్కలపల్లీ శ్రీనివాస్ రెడ్డి, ఫెర్టీలిసర్ సుధకార్  శాలువాలతో సత్కరించారు.గ్రామ ఏకగ్రీవ కమిటీకు అల్లపాడ్ యువత ముందు వుండి కొనసాగించిన తీరును చూసి వచ్చిన నాయకులు సంతోషం వ్యక్తం చేశారు, అలాగే అల్లపాడ్ గ్రామ కమిటీ యువత తీరును ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని,వ్యక్తం చేశారు. అనంతరం వారికి శాలువాతో సత్కరించినారు. జిల్లా మున్నూరుకాపు సంగం కమిటీ సభ్యులు  గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *