పాత నగర మున్నూరు కాపు సంగంలు ఏకగ్రీవం
హైదరాబాద్: గత కొన్ని ఏళ్లుగా పోటపొటిగా సాగిన పాతనగరం మున్నూరుకాపు సంఘాలు నేడు ఏకగ్రీవంగా ఒకే సంఘం రూపు దిద్దుకోవడం పట్ల కుల పెద్దలు సంతోషాన్ని వ్యక్తం పరుస్తున్నారు. రెండు సంఘాల కలయిక సమావేశంలో మున్నూరుకాపులు సంఘాల వల్ల అభివృద్ధి చెందడం మున్నూరుకాపు సభ్యులకు సేవ చేయడం ఆదర్శంగా తీసుకోవడం దానివల్ల ఇతర కులస్తులకు మన మున్నూరు కాపు సంఘాలు ముందు వరుసలో నిలిచే దశలో మన ఈ సంఘం పనిచేయాలని ఏకగ్రీవంగా వ్యక్తం చేశారు.ఈ రెండు సంఘాల కలయిక కోసం శ్రమించిన కుల పెద్దలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని స్థానిక పాతబస్తీలోని రెండు సంఘాలు ఏకమై అలియాబాద్, రాజన్న బావి సమీపంలోని లోటస్ బ్యాంక్యూట్ హాలులో పాతనగర మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా జరుపుకున్నారు. అధ్యక్షులుగా పల్లె శ్రవణ్ కుమార్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా మడిగల.భాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శిగా సుంకరి వేణు, పదాధికారులు, కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.పాతనగర మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు తిరుపతి శివకుమార్, ఆకుల శ్రీరాములు,సలహాదారులుగా సుంకరి నరహరి రావు, న్యాయవాది కొండూరు వినోద్ కుమార్,కావేటి గోవింద్ రాజ్, తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ కార్యదర్శులు బాశెట్టి లేనిన్ బాబు, కొంతం సురేష్ బాబు, కడేకర్ల ( గద్వాల) సత్యనారాయణ, ప్రత్యేక ఆహ్వానితులు, తిరుపతి శ్రీనివాస్, పొన్నాల సుదర్శన్, మహాసభ మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు శ్రీమతి తిరుపతి పరమేశ్వరి, మతి కుసుమ, శ్రీమతి లావణ్య తదితరులు పాల్గొన్నారు. కోసం మెరుపు.. ఇదే సంఘ సమావేశంలో మహిళ మున్నూరు కాపు అడహక్ కమిటీని కూడా నియమింపచేశారు.