మున్నూరుకాపు ఓల్డ్ సిటీ సంఘం అధ్యక్షులుగా పల్లె శ్రవణ్ కుమార్

0

 

హైదరాబాద్: మున్నూరు కాపులు సంఘటితంగా ఉండి అభివృద్ధి వైపు సంఘాలను నడిపించినప్పుడే ఆ సంఘం ఎంతో గుర్తింపు ఉంటుందని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు తెలియజేశారు. మంగళవారం పాత నగరం మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక ప్రమాణస్వీకారంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని శాలువాతో వెంకటేశ్వరరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గతంలో అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తిరుపతి శివకుమార్  నుండి ఇటీవల నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైన పల్లె శ్రవణ్ కుమార్  బాధ్యతలను స్వీకరించారు.సంఘం సలహాదారులు ఆకుల శ్రీరాములు   కార్యనిర్వాహక అధ్యక్షులు మడిగల భాస్కర్ రావు,ప్రధాన కార్యదర్శి సుంకరి వేణు,పదాధికారులు, కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన వారిచే ప్రమాణ స్వీకారం చేయించి శాలువాతో సన్మానించారు. అనంతరం
అధ్యక్షులు పల్లెశ్రవణ్ కుమార్ మాట్లాడుతూ మున్నూరుకాపు సంగం సంక్షేమమే ధ్యేయంగా ఈ కమిటీ కృషి చేస్తుందని తెలియజేశారు. ఐక్యమత్యంతో ఉన్నట్లయితే సాధించలేనిది ఏదీ లేదని పేర్కొన్నారు.  గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు మున్నూరుకాపులు రాజకీయంగా ఎదిగినప్పుడే రాజ్యాధికారం దక్కుతుందన్నారు. స్వార్థం కోసం మాజీ సభ్యులు కేవలం పదవుల కోసమే వేరుకుంపటి పెట్టుకోవడం సమాజసంకాదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్వరలోనే నూతన కమిటీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాతనగర మున్నూరుకాపు సంఘం ప్రముఖ న్యాయవాది మహాసభ సంఘం ఉపాధ్యక్షులు కొండూరు వినోద్ కుమార్ జీవితకాల సభ్యులు,సలహాదారులు, కార్యవర్గ సభ్యులు గడేకర్ల గద్వాల సత్యనారాయణ అనంతుల ప్రహ్లాద్, ఉద్దాడి చిత్తరంజన్ రావు, గడ్డమీది ప్రహ్లాద్, మహాసభ మాజీ ప్రత్యేక ఆహ్వానితులు పొన్నాల సుదర్శన్, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *