మున్నూరుకాపు అధ్యక్షులుగా పుటం పురుషోత్తం రావు విజయం

0

తెలంగాణ: రాష్ట్ర మున్నూరుకాపు సంఘం ఆదివారం నెక్లెస్ రోడ్  జలవిహార్ లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా సర్దార్  పుట్టం పురుషోత్తం రావు పటేల్, సమీప అభ్యర్థి వాసాల వెంకటేశ్వర్లు మధ్య పోటీ జరుగగ, పురుషోత్తంరావు పటేల్ 611 ఓట్ల ఆధిక్యత తో విజయం సాధించి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనారు.ఈ ఎన్నికలలో మొత్తం 717 ఓట్లు పోలవగా 611 ఓట్లు పుట్టం పురుషోత్తం రావు విజయం సాధించినారు. సమీప అభ్యర్థి  వాసాల వెంకటేశ్వర్లు కేవలం 87 ఓట్లు మాత్రమే పొందారు. ఈ ఎన్నికలలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్ది పెంటయ్య, మున్నూరు జయపాల్ రెడ్డి లు పోటీ పాల్గొనగా పెద్ది పెంటయ్య కు 447 ఓట్లు సాధించి ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు.సమీప అభ్యర్థి మున్నూరు జయపాల్ రెడ్డికి 256 ఓట్లు వచ్చాయి.(వీరిద్దరూ మహబూబ్ నగర్ జిల్లా కు ఒకే సంఘానికి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.) రాష్ట్ర కోశాధికారిగా మిర్యాలగూడ చెందిన కంచి సత్యనారాయణ పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులుగా అపెక్స్ కమిటీ మెంబర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బాధ్యత చేపట్టి  మాట్లాడుతూ ఈ సంఘం యొక్క బైలాస్ ప్రకారం అనుసరించి ఎన్నికలు నిర్వహించామన్నారు. దానిలో భాగంగా ఎన్నికైన వ్యక్తీ మూడు సంవత్సరాలు పదవి కాలంలో కొనసాగుతారని, అనేది ఉంది. గత కమిటీలో పనిచేసిన వ్యక్తి కాల పరిమితి అయిపోగానే వారు అపెక్స్ కమిటీని విమర్శించడం, అపెక్స్ కమిటీలో కులం కాని వాళ్ళుఉన్నారని తెలియజేశారు. ఆట్టి దానిని   పరిగణంలోకి తీసుకోవడం. జరిగింది. ఆలాంటి వదంతులు ఎవరు నమ్మవద్దని మున్నూరు కాపులకు దిశా నిర్దేశం అపెక్స్ కమిటీ యే అని అపెక్స్ కమిటీ రాష్ట్ర మున్నూరుకాపును ఏకం చేసి తీరుతుందనీ రవిచంద్ర అన్నారు, కుల ద్రోహులు కులాన్ని బ్రష్టు పట్టించే వారి మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దన్నారు,కార్యక్రమంలో అపెక్స్ కమిటీ సభ్యులు చింతల గట్టు విట్టల్ ,రౌతు కనకయ్య,మాజీ మంత్రి  జోగు రామన్న మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, తదితరులు పాల్గొని కుల అభివృద్ధి కోసం ప్రసంగించారు. జిల్లాల నుంచి వచ్చిన వివిధ సంఘాల అధ్యక్షులు ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,ఎన్నికల ప్రధాన అధికారిగా సిబిఐ విశ్రాంతి డైరెక్టర్  జెడి లక్ష్మీనారాయణ పాల్గొని గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించారు.ఈ ఎన్నికల నిర్వహకులుగ  రంగిశెట్టి మంగబాబు, విశ్రాంతి డిప్యూటీ కలెక్టర్ ఎర్ర నాగేంద్రబాబు సహాయకులుగా వ్యవహరించారు. ఎన్నికల కమిటీకి సహాయకులుగా హైకోర్టు న్యాయవాదులు ఊస రఘు ,లవంగాల అనిల్ కుమార్ వ్యవహరించారు, ఈ కార్యక్రమంలో మీసాల చంద్రయ్య, మంగళారపు  లక్ష్మణ్, బిజెపి నాయకులు బుక్కా వేణుగోపాల్ పటేల్, మాజీ డిప్యూటీ మేయర్ చల్ల హరి శంకర్ పటేల్  తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి పెన్ నెట్వర్క్ బృందం వాలంటరీగా బాధ్యత తీసుకోవడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *