శ్రీనివాసును సన్మానిస్తున్న మున్నూరుకాపు సంక్షేమ సంఘం
తెలంగాణ: హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గ కోట్ల శ్రీనివాస్ ఎన్నిక కావడం పట్ల శనివారం స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం జరిగినది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి ప్రమాణ స్వీకారం నిర్వహించినారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి మెంబర్ గ,అలాగే దిల్సుఖ్నగర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం గౌరవ సలహాదారులుగా శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.వీరు కాంగ్రెస్ పార్టీకి దాదాపు 25 ఏళ్ళు పైగా సేవ చేస్తూ పార్టీని బలోపేతంకు కృషి చేస్తున్నారు.అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా శ్రీనివాసులు మార్కెట్ కమిటీకి ఉపాధ్యక్షులుగా నియమింపజేశారు.శనివారం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వీరికి దిలీషుక్నగర్ మున్నూరుకాపు సంక్షేమ సంగం తరపున ఘనముగా సన్మానం చేశారు.ఈ కార్యక్రములో సంగం అధ్యక్షులు అనంతుల నవీన్ పటేల్, ప్రధాన కార్యదర్శి చక్రం నాగరాజు పటేల్, ఉపాధ్యక్షులు బాకారం సత్యనారాయణ పటేల్,ఆరే క్రాంతికుమార్ పటేల్, మామిడి అశోక్ పటేల్, మంత్రి రాజు పటేల్, చిరంజీవి వెంకటేష్ పటేల్ బండారు సురేష్ పటేల్ ఆకుల ప్రవీణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.