రైతు నాగలి విగ్రహాన్ని ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యే
మంచిర్యాల జిల్లా: ఖానాపూర్ మున్నూరుకాపు వేదికగా మున్నూరుకాపు ల ఐక్యత, సంఘ అభివృద్ధికి కోసం నా వంతుగా పాటుపడుతాను ఎమ్మెల్సీ దండే విఠల్ మున్నూరుకాపు సహకార సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలను కేటాయించటం హర్షం.ఖానాపూర్ పట్టణం కేంద్రంలో మున్నూరుకాపు రైతు విగ్రహాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ స్థానిక ఎమ్మెల్యే బోజ్జూ పటేల్,మాజీ మంత్రి జోగు రామన్న తో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కుల భాధవులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్ మున్నూరుకాపు లు ఆర్థికంగా,రాజకీయంగా చైతన్యవంతులు కావాలని, సమాజానికి దిక్సూచిగా నిలువాలని అలాగే కాపుల్లో ఎన్ని విభేదాలున్నా పక్కనపెట్టి ఐక్యతతో ముందుకు వచ్చి కలిసి పనిచేయాలని కోరారు. బీసీలకు రాజకీయంలో సమన్యాయం జరగాలంటే కాపులు అన్ని కులాలను కలుపుకొని వెళ్లాలని సూచించారు.మన సామాజిక వర్గానికి చెందిన ఎందరో నాయకులు ఎమ్మెల్యేలు గా ఎంపీలుగా సేవలు అందించారు.అందిస్తూనే ఉన్నారు.ఇంకా మున్నూరు కాపులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి.మున్నూరుకాపు యువత రానున్న రోజుల్లో రాజకీయాల్లో క్రియాశీలకం కావాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో అదిలాబాద్, నిర్మల్,మంచిర్యాల, జిల్లాల మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులకు కాపు సంఘం జిల్లాల అధ్యక్షులు, ఖానాపూర్, పెంబి, కడెం, దస్తురబద్,జన్నారం,ఉట్నూర్ మండలాల గ్రామాల మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు సభ్యులు కుల దాదాపు 2000 మంది మున్నూరు కాపులు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.