హైదరాబాద్: వరంగల్ తూర్పు శాసన సభ్యులు మంత్రి కొండా సురేఖ దంపతులకు ప్రధాన ముఖ్య అనుచరుడైన గోపాల నవీన్ రాజ్ కు ప్రభుత్వం ఇద్దరు గన్మెన్ల ను కేటాయించగ వారిని వెనక్కి తీసుకుంది. అయితే.. నవీన్ రాజ్ మీద కొంతకాలంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మంత్రి పేరు చెప్పుకుంటూ వరంగల్ జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు అధికారులను కూడా లెక్కచేయకుండా తనదైన శైలిలో పెత్తనం చేలాయిస్తూ.బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి.