హనుమకొండ : పెళ్లిల సీజన్ కావడంతో ఆదివారం రోజు హన్మకొండ బస్టాండులో హైదరాబాద్ వెళ్ళు ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల కోసం బస్టాండులో పరుగెత్తుతూ డిపో వద్ద బస్సు ఎక్కుతున్న తరుణంలో స్వల్ప గాయాలు అవుతున్నాయి దీంతోపాటు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్టీసీ వారు హన్మకొండ నుండి హైదరాబాదు దాదాపు 150 పైగా నిత్యం బస్సులు నడిపిస్తున్న తరుణంలో ఈరోజు చాలామంది ప్రయాణికులు రావడంతో ఆర్టీసీ వాళ్లు సరైన బస్సులను ఏర్పాటు చేయలేదని తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా భావించి జేబు దొంగలు ప్రయాణికుల నుండి దోచుకోవడం పరిపాటి జరుగుతుంది. స్థానికంగా భద్రత కల్పించకపోవడం బాధాకరం.