చేనేత కార్మికులకు అండగా ఉంటానని-ఎంపీ రవిచంద్ర
తెలంగాణ: హైదరాబాద్ బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మున్నూరుకాపు ప్రముఖులతో కలిసి చేనేత రంగానికి,నేతన్నలకు సంపూర్ణ మద్దతు తెలిపారు.చేనేత రంగాన్ని,నేతన్నలను ప్రోత్సహించేందుకు గాను “స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్”పేరుతో ఆగస్ట్ 10వతేదీన నెక్లెస్ రోడ్డులో “శారీ వాక్”జరుగుతుంది.దీనిని భాగ్య మీడియా,హలో హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తాయి.ఇందుకు సంబంధించిన పోస్టర్లను సోమవారం సాయంత్రం బంజారాహిల్స్ క్యాంప్ కార్యాలయంలో ఎంపీ రవిచంద్ర మున్నూరుకాపు ప్రముఖులు వి.ప్రకాష్, సుంకరి బాలకిషన్,మీసాల చంద్రయ్య,సర్థార్ పుటం పురుషోత్తమ రావు,రౌతు కనకయ్య,ఎర్రా నాగేంద్రబాబు,మంగపతి బాబు,చందు జనార్థన్, లవంగాల అనిల్,ఊసా రఘు,కనకేష్ పటేల్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్వాహకులు కోయ హరిమోహన్,కోయ కమల (భాగ్య మీడియా),పీ.వీ.లక్మీలు “శారీ వాక్”గురించి ఎంపీ రవిచంద్రతో పాటు మున్నూరుకాపు ప్రముఖులకు వివరించారు.నెక్లెస్ రోడ్డులో ఆగస్ట్ పదివ,తేదీన నిర్వహించనున్న అట్టి కార్యక్రమంలో సుమారు పదివేల మంది మహిళలు పాల్గొంటారని, అలాగే పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలియజేశారు.చేనేత రంగాన్ని,నేతన్నలను మరింత ప్రోత్సహించడంలో భాగంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగిందని,ఆ రోజు ఉదయం ఆరు నుంచి పదిగంటల వరకు శారీ వాక్ ఉంటుందని,ఇది మూడు కిలోమీటర్లు మేర కొనసాగుతుందని,ఏర్పాటు చేస్తున్న 60 స్టాల్స్ సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర తదితర ప్రముఖులు మాట్లాడుతూ, చేనేత రంగాన్ని,నేతన్నలను మరింత ప్రోత్సహించడానికి గాను నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అలాగే,ఈ కార్యక్రమంలో మద్దూరి నాగలక్ష్మీ,పుష్పాలత,శెట్టిపల్లి ఉదయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.