బీసీలకు అండగా ఉంటా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

0
తెలంగాణ: హైదరాబాద్ స్థానిక మండల ఎలక్షన్లో బీసీలకు రావలసిన 40 శాతం కేటాయించి, బిసి కుల జనగణ చేసిన తర్వాతనే ఎన్నికల నిర్వహించాలని, డిమాండ్ చేస్తూ ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకో లేని పక్షంలో తాను పదవికి రాజీనామా చేసి బీసీల కోసం నిలవడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మంగళవారం బిసి ఇంటలెక్టివ్ ఫోరం తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించిన సమావేశంలో తెలిపారు.మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో నాకు బీసీలు అండగా ఉండి గెలిపించినందుకు బీసీల అందరికీ రుణపడి ఉన్నానని ఈ సందర్భంగా వారిని గుర్తు చేస్తూ తెలిపారు.నేడు ప్రస్తుత పరిస్థితుల్లో బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ ఎంతైనా అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమానికి విశ్రాంతి ఐఏఎస్ అధికారి చిరంజీవి అధ్యక్షత వహించారు. ఈ బీసీ ఫోరం గ్రామస్థాయిలో ఉద్రిక్తం చేయడానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నామని దానికి బీసీలంత పార్టీలకతీతంగా ఒకటిగా ఉండాలని పలు డిమాండ్లతో వినితిపత్రాన్ని తయారు చేశారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ రాజ్య సభ్యులు వి హనుమంతరావు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రొఫెసర్ తిరుమలి,ఐఏఎస్ అధికారి చంద్ర వర్ధన్,ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎమ్మెల్సీ పూల రవీందర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మూగ జయశ్రీ, డాక్టర్ పుంజాల వినయ్ కుమార్,తొలివెలుగు జర్నలిస్టు రఘు, సీనియర్ జర్నలిస్టు లు దుర్గం రవీందర్, సుంకరి రామ్మూర్తి, సతీషు, వివిధ కుల సంఘ నాయకులు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్లు, సీనియర్ జర్నలిస్టు బిసి టైమ్స్ సూర్యారావు, సీనియర్ జర్నలిస్టు మాలి కరుణాకర్ పటేల్, కె.వి గౌడ్, చామకూరి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *