దేశంలో పెరిగిపోతున్న పెళ్లికాని వారి సంఖ్య 

0

దేశంలో పెళ్లికాని యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు గానీ వారి ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యక్తిగత నిర్ణయాలు వంటి కారణాల వల్ల వివాహాలు ఆలస్యమవుతున్నాయి. గతంలో తాతలు, తండ్రులు ఏదో శుభకార్యాలల్ల అమ్మాయిలు అబ్బాయిలు అక్కడ తటస్థ పడేది అక్కడనే పలాని వాడు అమ్మాయి ఉంది అబ్బాయి ఉన్నాడు చెప్పుకునే వాళ్ళు వెంటనే పెద్దలు కుదుర్చుకునే సంబంధం ఎన్నో ఉన్నాయి. అవి అప్పటినుండి ఇప్పటివరకు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత యుక్త వయసు జనాభాలో 51.1శాతం మంది పెళ్లి చేసుకోలేదని గణాంకాలు చెబుతున్నాయి.ఇందులో పురుషులు 56.3 శాతం, మహిళలు 45.7 శాతంగా ఉన్నారు.తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 47.5 శాతం,ఆంధ్రప్రదేశ్‌లో 43.7 శాతం పెళ్లికాని వారు ఉన్నారని జనాభా లెక్కల విభాగం వెల్లడించింది. ఇటీవల ఈ మధ్యన చాలామంది అమ్మాయిలు తల్లితండ్రులు జాతకం బాగా లదంటూ, అబ్బాయికి జీవితం తక్కువ, అబ్బాయికి ఆస్తిపాస్తులు తక్కువ, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు కదా, మరి మామూలు జీవితం గదా, అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదా ఇలా ఎన్నో వంకలతో అమ్మాయిల పెళ్లిళ్లు చేయలేకపోతున్నారు. కొందరు ఇతర కులస్తులతో ప్రేమ పెళ్లిళ్లు అమ్మాయిలు ఏర్పాటు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా అందుకు వారు ఒప్పుకోక తప్పడం లేదు. అబ్బాయికి ప్రస్తుతం 35 సంవత్సరములు పైబడిన వారు చాలామంది ఉన్నారు. ఇంటర్ డిగ్రీ చదివి వ్యాపారంలో, చిన్న చిన్న బ్యాంకులో పనిచేసేవారు అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం చాలా కష్టతరంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే చాలామంది పెళ్ళికాని ప్రసాదు లాగా మిగిలిపోవడం తప్పదు. అందుకే అమ్మాయిల తల్లితండ్రులు ఆస్తిపాస్తులు కాకుండా కుటుంబం గురించి బాగా ఆలోచన చేసి వారి మంచి చెడులను చూసి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటే చాలా మందికి శుభసూచకం. ఇలాగే కొనసాగితే జనాభా తక్కువ పరిస్థితి ఏర్పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *