దివ్యాంగులను మనోభావాలను దెబ్బతీసిన స్మిత సబర్వాల్
న్యూఢిల్లీ : దివ్యాంగులకు అఖిల భారత సర్వీసుల్లో రిజర్వేషన్లు అవసరమా అంటూ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు అస్సలు కరెక్ట్ కాదు.కచ్చితంగా దివ్యాంగుల సామర్థ్యాన్ని అవమానించడం, కించపరచడం. ఇరా సింఘాల్ 2014లో ఆల్ ఇండియా నెంబర్ వన్ ర్యాంక్ సాధించారు.మార్కుల్లో ఆమెను ఎవరూ ఇప్పటికీ బీట్ చెయ్యలేదు. పదేళ్లుగా ఇరా సింగాల్ అనేక ఉన్నత పదవుల్లో సమర్థవంతంగా వర్క్ చేస్తున్నారు.మన మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ ఎగ్జాంపుల్ బాల లతా మేడం. పన్నెండు ఏళ్ల పాటు సివిల్ సర్వెంట్ గా పని చేసిన బాలా లత మేడం,తన సర్వీస్ నుంచి స్వచ్ఛందంగా బయటికొచ్చాక వందల మంది సివిల్ సర్వెంట్లను తయారు చేశారు. దివ్యాంగులైన వాళ్లు పైలెట్లు, డాక్టర్లు చాలా మందే ఉన్నారు. అత్యున్నత పదవిలో ఉండి దివ్యాంగ సమాజం ఆత్మగౌరవం దెబ్బతీసేలా స్మితా సబర్వాల్ ట్వీట్ చేసి ఉండకూడదు. దివ్యాంగుల హక్కుల పోరాడాల్సిన టైంలో వాళ్లను తీవ్రంగా నిరుత్సాహపరిచేలా, వాళ్ల ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడటం తీవ్రంగా ఖండించాలి. దీనిపైన ఢిల్లీలో దివ్యాంగుల ఉద్యమాన్ని లేవదీస్తున్నట్టు తెలిపారు.