జగిత్యాలజిల్లా: జిల్లా మున్నూరుకాపు నూతనంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చదల సత్యనారాయణ పటేల్ మర్యాదపూర్వకంగా సోమవారం తెలంగాణ ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పటేల్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం పలు మున్నూరుకాపు సమస్యలపై విప్ కు వివరించారు. వీరితోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరుకాపు సంగం ప్రధాన కార్యదర్శి పొంచేటీ శంకర్ పటేల్ ఉన్నారు. నూతనంగా జిల్లా అధ్యక్షులు నియమితులైన చదల సత్యనారాయణ పటేల్ ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస పటేల్ వారికి అభినందనలు తెలియజేశారు. వారు ఇచ్చిన మున్నూరు కాపు సమస్యలను త్వరలో తెలుపుతమని వచ్చిన సంఘ ప్రతినిధులకు శ్రీనివాస హామీ ఇవ్వడం జరిగినది.