అదిలాబాద్ జిల్లా: తాలూకా మున్నూరుకాపు సంఘం అదిలాబాద్ సౌజన్యంతో మున్నూరుకాపు మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగే ఆషాడ మాసంలో (గోరింటాకు పెట్టుకోవడం) మెహందీ కార్యక్రమం ఈనెల 19 న శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్థానిక అదిలాబాద్ మున్నూరుకాపు సంఘ భవనంలో మహిళా సంఘం ఏర్పాటుచేసినారు.కావున మున్నూరుకాపు మహిళామణులు తప్పక ఈ కార్యక్రమంలో పాల్గొనాలని.మున్నూరుకాపు మహిళా సంఘం అధ్యక్షులు దేశెట్టి ప్రభ, ప్రధాన కార్యదర్శి జోగు రమణి, కోశాధికారి గంట స్వప్న ,ఒక ప్రకటనలో తెలిపారు.ఇట్టి కార్యక్రమానికి మున్నూరుకాపు సంఘం తాలూకా అధ్యక్షులు కాళ్ల విఠల్, ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్ ,కోశాధికారి కైపెల్లి జైపాల్ తదితరులతో పాటు మున్నూరు కాపు మహిళలు సంఘ నాయకులు పాల్గొంటారని తెలిపారు.