మున్నూరుకాపులకు ప్రభుత్వంలో స్థానం కల్పించాలి

0

 

సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగనన న్యాయబద్ధంగా చేయాలని, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లేపల్లి వెంకటేశ్వర్లు తెలియజేశారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య ఆదేశాల మేరకు మున్నూరు కాపు సంఘ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగనన చేపడుతున్న తరుణంలో  సర్వేను న్యాయబద్ధంగా చేసి అన్ని కులాల సంబంధించిన వివరాలను సమగ్రంగా చేయాలన్నారు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులకు ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు. రాష్ట్రంలో మున్నూరు కాపులు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది 18% పైన ఉన్నారని అన్నారు. మున్నూరుకాపు ల సంఖ్య బలాన్ని నిర్ధారించేందుకు గ్రామ, పట్టణ, మండల, నియోజకవర్గ , జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సమగ్ర సర్వే సంఘం ద్వారా చేస్తున్నట్లు తెలిపారు. మున్నూరు కాపుల సమగ్ర సర్వే ద్వారా ప్రభుత్వానికి ఒక నివేదికను అందించనున్నట్లు తెలిపారు.జనాభా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నామినేట్ పదవుల్లో ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరారు. మున్నూరుకాపు కార్పొరేషన్ కి చైర్మన్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ కి మూడు వేల కోట్ల నిధులు కేటాయించాలన్నారు.జిల్లా కేంద్రాల్లో మున్నూరుకాపు సంఘంకు భవనాల ఏర్పాటు చేయాలని కోరుతూ.కాంగ్రెస్ ప్రభుత్వలో మున్నూరుకాపులకు సముచిత స్థానం కల్పించాలన్నారు.జరిగిన ఎన్నికల్లో మున్నూరు కాపులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పూర్తి మద్దతు తెలుపమని అన్నారు.కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సన్నీరు మురళి,నియోజకవర్గ కోఆర్డినేటర్ బండ్ల కోటయ్య,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి కోలా నాగేశ్వరరావు,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నూనె సులోచన, పట్టణ ఉపాధ్యక్షులు కంబాల ప్రసాద్, పొనుగోటి సైదులు, గురవా రావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *