తెలంగాణ : ప్రస్తుత పరిస్థితుల్లో వివాహ వయస్సు స్త్రీ కి18 నుండి25,పురుషునికి 23 నుండి27,దాటి ,30.,35.,40. దాదాపు ఈసంవత్సరాలు వచ్చినా వివాహం చెయ్యని యువతీ యువకుల తల్లిదండ్రులకు అర్థం చేసుకోండి…అయ్యా,అమ్మా మనం మన పిల్లలకు 35,40 ఏళ్ళు వచ్చినా కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగం లక్షల్లో జీతాలు కోట్ల ఆస్తి లేదని,అలాగే ఉమ్మడి కుటుంబమని,వ్యాపారస్తుడని,తల్లిదండ్రులు పాత ఇల్లు అని,అన్నదమ్ములు పనికిమాలిన వారని, అక్కా,చెల్లెళ్లు ప్రేమ వివాహాలని ఇలా అనేక కారణాలతో,మన అర్హతను బట్టి కాకుండా మాకే అమ్మాయి ఉంది, నాకేం తక్కువ మేమే చాలా గొప్ప వాళ్ళం అని అత్యాశకు పోయి… వచ్చిన మంచి సంబంధాలు పెళ్లిచేయ్యకుండా, కాలయాపన చేస్తున్నారు.మనం మాత్రం మన అమ్మాయిలు/అబ్బాయిలు కష్టపడి సంపాదించిన లక్షలాది జీతాలతో ఇల్లు కొనుక్కొని AC రూంలో రకరకాలుగా భోగాలనుభవిస్తూ మన పిల్లలకు కుంటి సాకులు చెబుతూ త్రిశంకు స్వర్గాన్ని చూపిస్తున్నాం.చాలా మంది తల్లిదండ్రులు మంచి సంబంధమైనా సరిగా జాతకాలు కలవలేదని,ఏదో కుంటి సాకులతో  సంబంధాలు చెడ గొడుతున్నారు.తల్లిదండ్రులు,అన్నదమ్ములు,అక్కా చెల్లెళ్ళు లేకుండా అనాధలకు ఇస్తారా? పిల్లలను!కోటీశ్వరులు ఎక్కడో ఉంటారని, అపహహోలు పెట్టుకుని కాలయాపన చేస్తున్నారు.
చాలామంది అమ్మాయిలు/అబ్బాయిలు ఇలా ఘోషిస్తున్నారు.
మీకు పెళ్ళిచేసి పంపిస్తే.మేం ఎలా బ్రతికేది? ఆలోచిస్తున్నారు. కొందరు వధూవరులు మా అమ్మా నాన్నలే మాకు వచ్చే మంచి సంబంధాలు చెడగొడుతున్నారని భోరున ఏడ్చి చెప్పినట్లు చాలా చూస్తున్నాం!పెళ్లి చెయ్యడం మన బాధ్యత. మన చివరి దశలో  కూతురు/అల్లుడు / కొడుకు/కోడలు చూస్తే చూస్తారులే అని అనుకొని గర్వంగా జీవించేలా ప్రణాళిక చేసుకోవాలి. ముఖ్యంగా చాలా పంతులు జాతకాలు కలుస్తా లేవు అని చెప్పడంతో వచ్చిన సంబంధాలను వారి మించిన సంబంధాలను కూడా వదులుకోవడం మూర్ఖత్వం అవుతుంది.వాళ్లకు (అబ్బాయి తరుపున గాని/అమ్మాయి తరుపున గాని ఎన్ని బ్యాంకులలో అప్పులు ఉన్నాయో,బంగారం మీద ఎంత అప్పు ఉందో,చిట్ కంపెనీల్లో ఎన్ని ఉన్నాయో,ఇల్లు/కారు వాయిదాలు ఎన్ని ఉన్నాయో అనేక సందేహాలు అపోహలు పెట్టుకోవడం జరుగుతుంది.35-40 సం లు వచ్చినా కోటీశ్వరుడు/కోటేశ్వరాలు రాలేదని పెళ్లి చేయకుండా ఉంటే వాళ్లకు పిల్లలు ఎప్పుడు పుడతారు? ఎపుడు సంసారం చేస్తారు? 35,40 దాటాక సరదాలు తీరతాయా?.ఇప్పటికే చాలామంది అబ్బాయిలు ఇలాంటి తల్లి దండ్రుల వల్ల వర్ణాంతర వివాహాలు చేసుకుంటున్నారు.
అబ్బాయిలు కూడా వాళ్ళ అత్యాశ, కోరికలు వదిలి తమ అందానికి, అర్హతకు తగిన అమ్మాయిని చేసుకోవాలి.పెళ్ళి అయిన తరువాత అబ్బాయి/అమ్మాయి తల్లి దండ్రులు, ముఖ్యంగా వాళ్ల వాళ్ల కోరిక మేరకు నడుచు కోవాలి.వాళ్ల సంసార జీవితంలో, వాళ్ల అభిరుచులలో గడుపుక్కోవాలి. కొంత మంది అబ్బాయి తరుపు తల్లితండ్రులు వాళ్ల అబ్బాయి వాళ్ల ఆధీనంలోనే ఉండాలని కోరుకుంటారు మరియు వాళ్ల అబ్బాయికొచ్చే సంపాదన మీద అజమాయిషీ చేస్తారు.అదే తప్పు అక్కడే వాళ్ల మధ్య గొడవలకు కారణం ఔతారు.ఆ గొడవల్లో అమ్మాయి తరుపున వారు కూడా కలవటం వల్ల వారి చేతులారా వాళ్ల పిల్లల జీవితాలను పాడు చేసుకొంటారు.భర్త /భార్య చనిపోయిన అమ్మాయిలు/అబ్బాయిలు, విడాకులు తీసుకున్న అమ్మాయిలకు/అబ్బాయిలకు కూడా పెళ్లికాని అమ్మాయిలు/అబ్బాయిలు కంటే ఎక్కువ కోరికలు కోరుతున్నారు. ఇదొక దౌర్భాగ్యం.ఇప్పటికైనా మనం కళ్ళు తెరచి మంచి వాడు, గుణవంతుడు, కష్టపడే వాడు, సాంప్రదాయ కుటుంబంలోని అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్ళిచేసి వాళ్ళ సంతోషాన్ని చూసి ధన్యత పొందుదాం అలాగే గుణవంతురాలు,సాంప్రదాయ కుటుంబంలోని అమ్మాయికి మీ అబ్బాయినిచ్చి పెళ్ళి చేసి వాళ్ళ సంతోషాన్ని చూసి ధన్యత పొందుదాం.లేదు మేము మారం అని అనుకొంటే భగవంతుడా మాకు,మా అమ్మాయిలకు/అబ్బాయిలకు ఈ భూలోకంలో తగిన వరుణ్ణి/వదువును నీవు పొరపాటున సృష్టించటం మరచివుంటావు, మరుజన్మలోనైనా మాకోరికలకు తగిన వరుడిని / వదువును సృష్టించు అని ప్రార్ధిద్దాం!.ఎవరినీ ఉద్దేశించి కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *