30న వరంగల్ జిల్లా వరంగల్ కాపు సమావేశం
వరంగల్ : వచ్చేనెల ఫిబ్రవరి 2 ఆదివారం హనుమకొండ ఆర్ట్స్ కళాశాల నందు బీసీ రాజకీయ యుద్ధభేరి సభ జరుగుతున్న తరుణంలో బీసీల గొంతుకను తెలియజేయుటకు ఆ సభకు నాయకత్వం వహిస్తున్న మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కు మన మున్నూరు కాపుల సంఘాల తరఫున మద్దతుగా తెలుపుతూ జనవరి 30 తారీఖున ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపులు అత్యవసర సమావేశము ఏర్పాటు జరుగుతుంది. అందుకోసం నూతనంగా ఈ గ్రూపును ఏర్పాటు చేయడం జరిగినది. మున్నూరు కాపు అన్ని డివిజన్ ,మండల, నియోజకవర్గాల నుండి అధ్యక్షులు, కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు తప్పనిసరిగా 30న జరుగు మున్నూరు కాపు సమావేశానికి హాజరు కాగలరని ఈ గ్రూపు ద్వారా తెలియజేయడం జరుగుతున్నది….kvk News.