శ్రీ యాదగిరి లక్ష్మి నరసింహ స్వామీ మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం, *వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగుల చంద్రయ్య* ఈరోజు గుండె నొప్పితో అకాలమరణం చెందారు. వీరి స్వస్థలం ఆలేరు నియోజకవర్గం పరిధిలో ఉన్న కమటo గూడెంకు చెందినవారు. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ప్రస్తుతం కుమార్తె అమెరికాలో స్థిరపడినారు. చంద్రయ్య అకస్మక మరణం చెందడం పట్ల వారి కుమార్తె మంగళవారం రోజు తిరిగి స్వదేశానికి వస్తున్నట్లు సమాచారం, మంగళవారం రోజు వీరి అంత్యక్రియలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపినారు. చంద్రయ్య బిల్డర్ గా స్వయం శక్తితో ఎదిగి చాలామందికి తనదైన శైలిలో ఆర్థిక సహాయాన్ని అందించారు, వేములవాడ మున్నూరు కాపు సత్రం నిర్మాణ విషయంలో తన అనుభవాన్ని తెలియజేశారు. యాదాద్రిలో కాపు సత్రం ఏర్పాటు చేయాలని సంకల్పంతో స్థానిక పెద్దలతో కలిసి నిర్మాణాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని నిర్మాణం చేపట్టినారు.నిర్మాణంలో అనుభవాన్ని కూడా చూపించారు. చంద్రయ్య మరణం పట్ల యావత్ మున్నూరు కాపులు (కాపులు) దిగ్భ్రాంతి చెందుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. *చంద్రన్న* మరణం పట్ల *కాపు వికాసం పత్రిక మాలి కరుణాకర్* ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.