తీన్మార్ మల్లన్నను కలిసిన పెద్దింటి అశోక్ కుమార్
తెలంగాణ : ప్రముఖ రచయిత, విద్యావేత్త,పెద్దింటి అశోక్ కుమార్ (బలగం సినిమా రచయిత) సోమవారం ఉదయం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అశోక్ కుమార్ ను తీన్మార్ మల్లన్న శాలువాతో సన్మానించారు. వీరి ఇరువురి మధ్య తెలంగాణ ఉద్యమం గురించి, బీసీల రాజ్యాధికారం కోసం పలు అంశములపై చర్చించారు. పెద్దింటి అశోక్ కుమార్ రచించిన కొన్ని పుస్తకాలను మల్లన్నకు ఈ సందర్భంగా అందజేశారు.వివిధ కులాల వారు చేస్తున్న వృత్తులపై ప్రత్యేక పుస్తకాలను పెద్దింటి అశోక్ కుమార్ రాయడం చాలా గర్వకారణమని తీన్మార్ మల్లన్న ఈ సందర్భంగా అశోక్ కుమార్ ను కొనియాడారు. అశోక్ కుమార్ రచించిన పుస్తకాలను ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం తాను అన్ని విధాలుగా సహకరిస్తానని అలాగే అశోక్ కుమార్ సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మనస్ఫూర్తిగా అభినందించారు. వీరితోపాటు కాపు వికాసం పత్రిక సంపాదకులు మాలి కరుణాకర్ పటేల్ తో కూడా ఇరువురు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి, వివిధ కులాల చైతన్యం కోసం ఏ విధంగా ముందుకు సాగాలని అంశంపై ముచ్చటించారు.