ఆర్థిక సహాయం అందించిన మున్నూరు కాపు సంఘం
తెలంగాణ : భూపాల్ పల్లి జయశంకర్ జిల్లా మున్నూరుకాపు సంఘం భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం కాశింపల్లి గ్రామంలో మున్నూరుకాపు కు చెందిన సిద్ధం రాకేష్ గత పది రోజుల క్రితం డెంగ్యూ వ్యాధితో మరణించారు, శుక్రవారం 11వ దినం పురస్కరించుకొని మున్నూరుకాపు సంఘం భూపాలపల్లి జయశంకర్ జిల్లా కమిటీ తరఫున వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తరఫున పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో భూపాలపల్లి జయశంకర్ జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు పెండెల సంపత్ పటేల్, ప్రధాన కార్యదర్శి గండు రమేష్ పటేల్ కోశాధికారి గుమ్మడి ప్రదీప్ పటేల్ ఉపాధ్యక్షులు పిప్పాల రాజేందర్ పటేల్ భూపాలపల్లి మండల అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్ పటేల్ తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు కౌటం రవి పటేల్ మున్నూరు కాపు సంఘం ఘనపురం మండల నాయకులు గండు కరుణాకర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.