మున్నూరుకాపు విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ
హైదరాబాద్: సికింద్రాబాద్ మున్నూరుకాపు సంఘం కార్యాలయంలో *”టీమ్ వి ఫర్ యు ఫౌండేషన్*” ఆధ్వర్యంలో మున్నూరు కాపు కులానికి చెందిన పేద విద్యార్థులకు ఉచిత నోటుబుక్స్ పంపిణీ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ చైర్మన్ సుంకరి భానుమతి, ప్రధాన కార్యదర్శి సుంకర రామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథులుగా హాజరైన మున్నూరు కాపు మాజీ అధ్యక్షుడు గంప చంద్రమోహన్, సికింద్రాబాద్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు లింగిశెట్టి హనుమంతరావు చేతుల మీదుగా దాదాపు వంద మంది విద్యార్థులకు నోటుబుక్స్ అందజేశారు.ఈ సందర్భంగా సంఘానికి చెందిన మాడ ప్రమోద్, ఘర్ష మోహన్, సిరిగిరి పవన్,నాగరాజు, మున్నూరు చందు, కట్కూరి శ్రీకాంత్, పట్టి్యం సుదర్శన్, బత్తుల రాములు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు చైతన్య శ్రీ,ఉదయ్ తేజ తదితరులు తమ హర్షాన్ని వ్యక్తపరిచారు.సేవా కార్యక్రమాల్లో టీమ్ వి ఫర్ యు ఫౌండేషన్ ముందుంటుందని నిర్వాహకులు తెలిపారు.