కాపు ప్రజాప్రతినిధుల తీరుపట్ల తీవ్ర అసహనం-వి,హెచ్

0

తెలంగాణ- హైదరాబాద్:మున్నూరుకాపు ప్రజాప్రతినిధుల పట్ల మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు,కారటు పైన చేతాడు పొడుగు పేర్లు ఉంటే, స్టేజి మీద ఇద్దరు, ముగ్గురే ఉంనారని అలాంటి వారిని ఎందుకు పిలుస్తారు? ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు,ఎందుకీ సన్మానాలు చేస్తార్రాబాబు? …మీకు పని పాట లేదా?కులానికి విలువ ఇవ్వని వాల్లను పిలవకండి,కార్డు లో పేరు వేయకండి, అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు,ఆదివారం తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ నిర్వహించిన ప్రజాప్రతినిధుల సన్మానసభలో ఆయన ఒకింత తీవ్ర అగ్రహానికి గురయ్యారు, ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, కులం మీద గౌరవం,అబిమానం, ప్రేమతో ప్రజా ప్రతినిధులను పిలుస్తున్నారు. వారు దాన్ని అలుసుగా తీసుకొని కులాన్ని సంఘాన్ని అవమాన పరచడం సిగ్గు చేటని… మరోసారి ఎవరిని పిలవకండిరాబాబు, వారికి సహకరించకండని సంఘం నాయకులను మందలించారు. గతంలో కూడా ప్రజా ప్రతినిధుల సన్మానసభ పెట్టి కార్డులు ప్రింట్ చేసి ప్రజాప్రతినిధుల ఇంటింటికి తిరిగి కార్డులు ఇచ్చి ఆహ్వానించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భోజనాలు, బ్యానర్లు మెమొంటోలు, బొకేలు,శాలువాలు, సన్నాయి మేళం, ఫోటోగ్రాఫర్,వీడియోగ్రాఫర్ తదితర ఎన్నో ఏర్పాటు చేసి హంగులు ఆర్భాటాలతో కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఎవరు రాలేదు,కులం కోటలో సీట్లు కావాలి, కులం ఓట్లు కావాలి, కులం కోటలో పదవులు కావాలి,కానీ కులాన్ని మాత్రం పట్టించుకోరు, ఎవడికి వాడే సంఘాలు పెడుతూ కులాన్ని విడగొడుతుంటే ఎవరూ పట్టించుకోరు, కాచిగూడలో అత్యంత విలువైన స్థలం ఉంటే ఇక్కడ ఒక భవంతిని కూడా కట్టుకోలేకపోతున్నo,గత ప్రభుత్వఈచ్చిన స్థలాన్ని కూడా పట్టించుకోవడంలేదు, ప్రజా ప్రతినిధులు ఒక్కటై అందరినీ ఏకం చేసి కులాన్ని అభివృద్ధి చేస్తే బీసీలలో అగ్రస్థానంలో ఉంటామని, రాజ్యాధికారంకూడా వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన ఆవేదనలో నిజం ఉందని పలువురు కుల బంధువులు చర్చించుకోవడం గమనార్హం, ఇక భవిష్యత్తులో ప్రజా ప్రతినిధులకు సన్మాన సభలు పెట్ట కూడదన్న చర్చ కూడా జరగటం కొసమెరుపు. ఒక కాపునాయకుని సౌజన్యంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *