మున్నూరుకాపు మహిళా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుక.. బండి పద్మ

0
తెలంగాణ: పసుపు రంగుల పూలు, గునుగు పూలతో అలంకరించి తొమ్మిది రోజులు పాటు బతుకమ్మను పేర్చి నీటిలో వదులుతూ సంబరాలు జరుపుకునే  ఈ పండుగ విశేషం.. శివుడు లేని పార్వతి గురించి  మహిళలు పాడుతూ నిర్వహించే ఈ బతుకమ్మ పండుగను వాడవాడలా తెలంగాణ మహిళలు సంతోషంగా జరుపుకుంటారు, దానిలోనే భాగంగా మున్నూరు కాపు మహిళలు ఈ నెల 5 శనివారం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకురాలు బండి పద్మ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణలో ఉన్న మున్నూరు కాపు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ.. తెలంగాణలో మున్నూరు కాపు మహిళలకు అన్ని స్థానాలలో ప్రాతినిత్యం కల్పించాలని కోరుతూ ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఉన్న మహిళ సోదరిమణులందరికీ ఒక ఆదర్శంగా ఉండాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. వచ్చిన అతిధులకు అల్పాహారం, ఏర్పాటుచేసి సంఘం ఆధ్వర్యంలో వారికి చిరు కనుక కూడా మహిళలకు అందిస్తామని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *