మున్నూరు కాపు ఓల్డ్ సిటీ కార్యాలయము ప్రారంభం
హైదరాబాద్: పాత బస్తి లాల్ దర్వాజా లో పాతనగర మున్నూరుకాపు సంఘం నూతన కార్యాలయములో అధ్యక్షులు పల్లె శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. సంగం ప్రారంభోత్సవం సందర్భంగా రిబ్బన్ కట్ చేసి పాతనగర మున్నూరుకాపు సంఘం నూతన కార్యాలయాన్ని అధ్యక్షులు పల్లె శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాతనగర మున్నూరుకాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మడిగల భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి సుంకరి వేణు, రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ ఉపాధ్యక్షులు, న్యాయవాది కొండూరు వినోద్ కుమార్, తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు శ్రీమతి తిరుపతి పరమేశ్వరి, పాతనగర మున్నూరుకాపు మహిళ సంఘం కన్వినర్, శ్రీమతి కాసుల కుసుమ,సలహాదారులు తిరుపతి శివకుమార్,చుక్క అశోక్ కుమార్, ఆకుల శ్రీరాములు, దేవరశెట్టి ప్రభాకర్, ఉపాధ్యక్షులు తిరుపతి రాఘవేందర్, పొన్నా చలపతి, కేడల దినేష్, ముత్యాల సత్యనారాయణ, అల్లం భాను, బొడ్డు సాయిబాబ, మేగీ అనిల్, ఆకుల నర్సింగ్ రావు, కాటికే శ్రీధర్, పూస కృష్ణ, కోసిగె భరత్, ఆకుల ప్రభాకర్, ఎల్లా కిషనరావు, మారిశెట్టి సునీల్, తిరుపతి నాగేష్ పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.