నిరుపేద పెళ్లి కూతురికి ఆర్థిక సహాయం అందించిన సేవా సంస్థ
ఆంధ్ర ప్రదేశ్: తల్లిని కోల్పోయిన నిరుపేద యువతి వివాహానికి సాయం చేయమని అభ్యర్ధిస్తూ ఆశ్రయించిన ఓ తండ్రి (రాజోలు మండలం). మానవతా మూర్తులు – సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సోషల్ మీడియా మిత్రుల ద్వారా సమకూర్చిన అరవై వేల రెండు వందల ఎనభై ఏడు ను శ్రీరామనవమి రోజున రాజోలు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు దేవ వరప్రసాద్ వారి చేతుల మీదుగా యాభై రెండువేల ఎనిమిది వందల ఏడు ను పెళ్ళి కుమార్తె తండ్రికి అందించారు.అలాగే చిన్ని చిన్ని ఖర్చుల నిమిత్తం కోసం పెళ్లి కుమార్తె కు పది వేలు రూపాయలను అందించారు. వీరితోపాటు మరికొందరు.. దాతలు ముందుకు వచ్చిన వారిలో బోడపాటి కేశవదేవరాయ మణికంఠ పూజా స్టోర్స్ హైదరాబాద్ ఐదు వేల ఒకటి రూపాయలు,చీర సత్యనారాయణ వేగేశ్వరపురం హైదరాబాద్ వేయి రూపాయలు,కుమారి బోనం దివ్య అంతర్వేది ఐదు వందలు, రూపాయలు బోనం సత్య ఐదు వందలు, రూపాయలు ప్రసాద్ సఖినేటిపల్లి ఐదు వందలు రూపాయలు వేగిరౌతు బాబులు ఐరన్ షాపు లక్కవరం ఐదు వందలు రూపాయలు, వంద రూపాయలుఈ మొత్తాలు సమీకరణలో విశేషకృషి చేసిన గాదె విజయ్ కుమార్ రేపల్లె,వాండ్రాసి రామారావు పుగాకులంక, పల్లపోతు జైదీప్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఫ్రెండ్స్ హోప్ హెల్పింగ్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు ఎంతో ఉదారంగా మొత్తం పెండ్లి ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చినప్పటికీ పదిమంది సహకారంతో జరగాలనే ఆకాంక్ష ను అర్ధం చేసుకుని తగువిధంగా అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తు.వారి సహాయం తీసుకోలేకపోయినందుకు మా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము. దీంతోపాటు తమ ప్రక్కింటి లోని బిడ్డ పెళ్ళి జరిగుతున్నట్లుగా ఎంతో ఉదారంగా స్పందించిన అభినందించిన వారిలో పల్లపోతు సత్యనారాయణమూర్తి, బండారు భాస్కర్, గుబ్బల రవికిరణ్, కందుల విజయ్ కుమార్, తెన్నేటి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు..