నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న కల్లూరు రాజు
రాజన్న సిరిసిల్ల జిల్లా:సిరిసిల్ల పట్టణ వెంకంపేట్ కు చెందిన నిరుపేద కుటుంబానికి గడప దయాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ స్థానిక మాజీ కౌన్సిలర్ కల్లూరు రాజు సేవాదృక్పథంతో తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం సోమవారం ఉదయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్,కొక్కుల నర్సయ్య,లింగంపెల్లి దేవయ్య,గోక లక్ష్మిరాజాం, నంగునూరి శ్రీనివాస్, కొండి రాజు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.