నిరుపేదకు అండగా నిలిచిన నిమ్మశంకర్ పటేల్

0

 

సికింద్రాబాద్: సికింద్రాబాద్ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో సంఘ సేవకులు మహాసభ మాజీ ట్రస్ట్ సభ్యులు నిమ్మ శంకర్ పటేల్ సాకారం తో మున్నూరుకాపు చెందిన పేద విద్యార్థి కి 35 వేలు రూపాయలు నగదు ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్బంగా నిమ్మ శంకర్ మాట్లాడుతూ తమ సామాజిక వర్గంలో నిరుపేదలుగా ఉన్న విద్యార్థులకు,విద్యార్థినులకు చదువుల నిమిత్తం కోసం ఆర్థిక సహాయం చేయడం, అలాగే నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు కూడా అందజేయడం నాకు దేవుడు ఇచ్చిన వరం గా భావించానని నిమ్మ శంకర్ తెలియజేశారు. మనలో ఇంకా ఆర్థికంగా ఉన్నవారు ఇలాంటి సేవా కార్యక్రమాలు పాలుపంచుకోవాలని నిమ్మ శంకర్ పటేల్ తెలియజేశారు.పారిశ్రామిక రంగంలో ఆర్థికంగా ఉన్నప్పటికీ సేవ గుణం చేయాలనే తన భార్య,కొడుకుల ప్రోత్సాహంతో చేయడంలో ఆనందంగా ఉంటుందని ఈ సందర్భంగా శంకర్ తెలియజేశారు. సంగం అధ్యక్షులు లింగిశేటి హనుమత్ రావు మాట్లాడు స్థానిక మున్నూరుకాపు కు చెందిన భూషణం త్రిష  పేద విద్యార్థి ఉన్నత చదువు కోసం ఆర్థిక సోమత లేక పోవడంతో సికింద్రాబాద్ మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు లింగిశేటి హనుమంతరావు కు తెలిసిన పిమ్మట  సహృదయుడు నిమ్మ శంకర్ సంప్రదించగా వారు వెంటనే స్పందించి 35 వేలు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని హనుమంతరావు తెలియజేశాడు.మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మ శంకర్ వారి సేవ గుణం చూసి మున్నూరుకాపు కుల బంధువులు శంకర్ కు అభినందనలు తెలియజేశారు. గత 25 ఏళ్లగా నిరుపేదలకు అండగా ఉంటున్నా నిమ్మ శంకర్ పటేల్ కు సికింద్రాబాద్ సంఘం వారు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లింగిశేటి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి చీరాల శ్రీనివాస్, మాడ ప్రమోద్, బత్తుల రాములు, రాచూరి ప్రదీప్ కుమార్, తేల శ్రవణ్, షామీర్పేట్ కృష్ణ ,మున్నూరు చందు, శ్రీరి గిరి అనుప్ ,సామల వినోద్,ఘర్షణ సత్యనారాయణ  కొవ్వూరు ప్రకాష్, ఏలకంఠ ప్రకాష్,అలకపల్లి హరికృష్ణ  రాచూరి లక్ష్మి, కొత్త కల్పన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *