విద్యార్థినికి అండగా నేనుంటా అల్లం కిషన్ పటేల్

0

హైదరాబాద్: సరస్వతి దేవి కరుణించిన లక్ష్మీదేవి వరమివ్వకపోవడం ఆ విద్యార్థికి శాపంగా మారింది, తాను నిరుపేద కుటుంబంలో జన్మించాలని నిరుత్సాహంతో అలాగే కన్న తండ్రి కోల్పోయి చదువుకోవాలని తపనతో ముందుకు సాగాలని ఆ చదువుతో పదిమందికి నేను ఉపయోగపడాలని సంకల్పం ఆ విద్యార్థినిలు గుండెల్ని నిండా ఉన్నది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల సహాయం కోసం ఎదురుచూస్తూ ఉన్న తరుణంలో జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్వతి సతీష్ పటేల్ నీ అమ్మాయి వేడుకున్నది వీరు వెంటనే స్పందించి, దాతలు ముందుకు రండి అనే వివిధ సోషల్ మీడియాలో సమాచారాన్ని తెలిపారు, చాలామంది స్పందించారు కానీ ముందుకు రాలేదు, ఆ దేవుని దయ వల్ల నా సామాజిక వర్గానికి చెందిన మున్నూరుకాపు ముద్దుబిడ్డ కు నేను అండగా ఉంటానని, చూసి స్పందించిన రిటైర్డ్ అల్లం. కిషన్ పటేల్ తాడుత్తంతో ముందుకు వచ్చారు. కుందనపల్లి.అంజలి ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి వరకు చదువుకొని 10/10 మార్కులు సాధించినది. రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం లో రెండు సంవత్సరాలు కడప,నాలుగు సంవత్సరాలు ఒంగోలులో చదవాలి. చదువు కొనసాగాలంటే సంవత్సరానికి 70 వేలు ఫీజు వున్నందున దీనికి తోడు హాస్టల్ ఫీజు తో కలిపి సుమారు ఆరు సంవత్సరాలకు ఏడు లక్షలు అవుతాయి. తండ్రి లేని కారణంగా తన వంతు సాయంగా ముందుకొచ్చి సహకారం అందిస్తూ  అల్లం కిషన్ రావు పటేల్ యాభై వేలు రూపాయలను మంగళవారం విద్యార్థినికి అందించారు. సహృదయంతో ఇంకా దాతలు సహాయం అందించాలని తెలుపుతూ ఒకవేళ దాతలు ముందుకు రానిచో తానే మొత్తం చెల్లిస్తానని కిషన్ రావు పటేల్ తెలియజేశాడు.ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చెయదలచినవారు విద్యార్థిని తల్లి జ్యోతి పొన్ పే నెంబర్.6309732254, అందజేసే వివరాలను పార్వతీ సతీష్ కు అందజేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *