మన అధ్యక్షురాలు రమకు ఆర్టికల్ బహూకరణ అందిస్తున్న మాలి కరుణాకర్

0

 

హైదరాబాద్: సామాజిక వర్గానికి తన వంతు సేవ చేయడానికి సేవ సంకల్పంతో అమెరికాలో మన అసోసియేషన్ అధ్యక్షురాలుగా తొలి మహిళగా నియమితులైన రమ ముండిచింతల ఇటీవల భారతదేశానికి హైదరాబాదుకు విచ్చేసిన సందర్భంగా ప్రైవేటు హోటల్లో ఆత్మీయ కలయిక సమావేశానికి హాజరయ్యారు. మన అధ్యక్షురాలు రమకు కాపు వికాసం పత్రిక సంపాదకులు మాలి కరుణాకర్ పటేల్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా  నియమితులైన ఆర్టికల్ ఫోటో ప్రేమ్ జ్ఞాపకార్ధంగా వారికి అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సుంకరి రామ్మూర్తి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా రమా మాట్లాడుతూ.. అమెరికాలో స్థిరపడిన మున్నూరు కాపులను ఒక వేదిక ద్వారా ఏర్పాటు చేయడం, ఎలాంటి ఆర్థిక వనరులు లేకుండా పరస్పర సహకారంతో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.మన కులస్తులు అమెరికాలో ఉన్నవారికి అన్ని విధాల సహాయ సహకారాలను వారికి అందించడం జరుగుతుందని తెలిపారు.తనకు అధ్యక్ష పదవి ఒక నామం మాత్రమే గానీ సేవా కార్యక్రమంలో తన వంతు పూర్తి బాధ్యతగా నిర్వహిస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అమెరికా మన అసోసియేషన్ గత అధ్యక్షులు రమేష్ మాగంటి, రమేష్ నల్లవెల్లి, అనిల్ ముండిచింతల తోపాటు, స్థానికులు జస్టిస్ సివి రాములు, ప్రముఖ వైద్య నిపుణలు డాక్టర్ వినయ్ కుమార్ పుంజాల, మహిళ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ నర్తకి డాక్టర్ అలేఖ్య పుంజాల, డివి రావు, సర్దార్ పుటం పురుషోత్తం, తోపాటు ప్రముఖు కాపు సంఘ నాయకులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *