తీన్మార్ మల్లన్న విలేకరు సమావేశంలో..
హైదరాబాద్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విలేకరుల సమావేశంలో బీసీ ఉద్యమం కోసం ఎల్లవేళల కృషి చేస్తానంటూ ప్రభుత్వం పనితీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వివరాల అందిస్తూ… తీన్మార్ మల్లన్న తన మాటల్లో ముఖ్యమంత్రి మీ యొక్క సస్పెన్షన్ ఆర్డర్ అందింది.రేవంత్ రెడ్డి చాలా రోజుల నుండి నన్ను సస్పెండ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.ఇక బీసీ ఉద్యమాన్ని ఇక్కడి నుండే నడిపించడానికి బీజం మీరే వేశారు.చాలా రోజుల నుండి బి సి బిడ్డలు నా సస్పెన్షన్ ఆర్డర్ పై స్పందించమని అడుగుతున్నారు.అందుకే ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసాము.రేవంత్ రెడ్డి గ్రహించావాల్సిన విషయం ఏమిటి అంటే ఇప్పుడు ఉన్న బీసీ లు మలి దశ ఉద్యమాన్ని నడిపిన వారు.బీసీ లపై మాత్రమే చర్యలు తీసుకుంటాము అంటే ఇక పోరాటమే చేస్తాము కానీ భయపడే ప్రసక్తే లేదు.నేను చేసిన తప్పు ఏమిటో చెప్పాలి.ఒక వేళ తప్పుడు సర్వే ప్రతులను కాల పెట్టడం తప్పు అనిపిస్తే అదే తప్పు ను నేను మళ్ళీ చేస్తా.ఎందుకు అంటే అది పూర్తిగా వివక్ష తో కూడుకున్న తప్పు సర్వే కాబట్టి అలా చేశాను.కోటి పదిహేను లక్షల ఇండ్లు ఉంటే తెలంగాణ జనాభా ఎలా తగ్గిందో ముఖ్య మంత్రి చెప్పాలి.ఈ డబ్ల్యూ కోట ప్రకారం రిజర్వేషన్ మీ ఇష్టం వొచ్చినట్టు ఇస్తే ఆ అన్యాయాన్ని కచ్చితంగా ప్రశ్నిస్తాము.మీ సర్వే తప్పు అని చెప్పాను. అది నిరూపించడానికి ఎక్కడికయినా వొస్తా నిరూపిస్త.ముఖ్య మంత్రి మీరు బాధ్యతయుత పదవి లో ఉన్నారు.బిసి లకు అన్యాయం జరుగుతుంటే సరి దిద్దుకోమని సూచించాను.తెలంగాణ గడ్డ ఎంతో మంది నాయకులను చూసింది.బిపి మండల్ లాంటి మంచి చేసిన వారిని గుర్తు పెట్టుకుంటుంది. అన్యాయం చేసిన వారిని గుర్తు పెట్టుకుంటుంది.కాంగ్రెస్ పార్టీ లో అగ్ర వర్ణాలకు మాత్రమే అంతర్గత భద్రత ఉంటుంది.కానీ బడుగు బలహీన వర్గాల పైనే మీరు చర్యలు తీసుకుంటారా.కెసిఆర్ ప్రభుత్వం పై పోరాటం చేసిన వారిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పునాది వేసిన వారిలో నా పాత్ర కీలకం.మీ షోకాజ్ నోటీసు లకు ఇక్కడ బయపడే వాడిని కాదు. ధైర్యం గల బీసీ బిడ్డను.కచ్చితంగా రాహుల్ గాంధీ ఆశయాలు కొనసాగించడానికి పాటు పడతా.ఈ రోజు తీన్మార్ మల్లన్న కు టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఇలాగే నా మాట్లాడేది అని అంటున్నారు.ఎవరు అండి నన్ను గెలిపించింది. నల్గొండ వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా ఉండి గెలిపించుకున్న.మహబూబ్ నగర్ లో మరి కాంగ్రెస్ అభ్యర్థిని మీరు ఎందుకు గెలిపించుకోలేక పోయారు.ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ని ఖతం చేసే ప్రయత్నం జరుగుతుంది అని అందరికి అర్ధం అవుతుంది.నన్ను సస్పెండ్ చేస్తే బాధ,భయం నాకు ఏమి లేదు.ఈ రోజు జరుగుతున్న ఎమ్ ఎల్ సి ఎన్నికలను చూస్తే బీసీ ల శక్తి ఏంటో తెలుస్తుంది.మేమంతా కలిసి గెలిపించిన కాంగ్రెస్ పార్టీ ని మీరు ఖతం చేయడానికి చూస్తున్నారు.బీసీ లకు అన్యాయం చేయడానికి చూస్తే ఊరుకోము.రేపటి నుండి రోజు ఒక కార్యాచరణ తీసుకొని బీసీ లకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాము.నేను ఏ పార్టీ లోకి వెళ్లడం, పార్టీ పెట్టడం మీద ద్రుష్టి పెట్టలేదు.తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ లో కేవలం బీసీ కుల గణన చేస్తామన్న అంశానికి మాత్రమే ఆకర్షతుడయి చేరడం జరిగింది.బీసీ వాదానికి కట్టుబడి మాత్రమే నేను పని చేస్తా.బీసీ లను కించపరిచే ఎలాంటి చర్యల పైన అయిన అందరం కలిసి పోరాటం చేస్తాము. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పూర్వపు ముఖ్యమంత్రి పిఆర్వో గట్టిక అజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు.