వరద బాధితులను ఆదుకున్న ఎంపీ పుట్ట

0

ఏలూరు జిల్లా : పోలవరం నియోజకవర్గంలో వేలేరుపాడు మండలం కుమ్మరిగూడెంలో పెదవాగు ప్రాజెక్టు వలన ముంపుకు గురై వేళ్ళడానికి దార్లులేక ట్రాక్తర్లుపై ఆ గ్రామానికి చేరుకొని పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్న వారిని పరామర్శించి వారికి శిబిరాలలో అందుతున్న వైద్య సేవలను, బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువులను పరిశీలించి వారిని పరామర్శించిన ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్,ఈ కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు వారు,చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ,ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, బొరగం శ్రీనువాస్,మాజీ ఎమ్మెల్యే ఘంట మురళీకృష్ణ పాల్గొన్నారు.భారీ వర్షాలకు పేదవాగు ప్రాజెక్ట్ గట్టు తెగి ముంపుకు గురైన బాధితులకు మెరక ప్రాంతాలలో శాశ్వత ప్రత్తిపతికన ఇళ్ళు నిర్మిస్తామన్నారు. ముంపుకు గురైన ఏడు పంచాయతీలలోని, పన్నెండు గ్రామాలలో ఆరోగ్య సమస్యలు రాకుండా బ్లీచింగ్ చల్లి దోమ తెరలను మరియు మందులను అదించాలని గ్రామ పంచాయతీ అధికారులకు ఎంపీ ఆదేశించారు.ఢిల్లీ నుంచి ఫోన్ చేయగానే తక్షణం స్పందించి ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా చర్యలు చేపట్టిన ఏలూరు జిల్లా అధికారులకు, పోలీసు యంత్రాంగాన్ని ఎంపీ పుట్ట మహేష్ కుమార్  అభినందించారు. వరదల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను హెలికాప్టర్ సహాయంతో కాపాడిన విపత్తు నిర్వహణ శాఖ వారిని ఎంపీ అభినందించారు.ఈ సందర్భంగా బాధితులకు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్  ఆర్ధిక సహాయంతో నిత్యావసర వస్తువులను స్థానికులకు అందించిడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఎవరూ భయపడవలసిన పనిలేదు ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది. బాధితులకు అండగా ఉంటుందని, ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. జ్వరాలు వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకుంటున్నారు.వైద్య బృందం కూడా అప్రమత్తంగా ఉంది అని భరోసా ఇచ్చారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *