నిరుపేద కుటుంబానికి పుస్తె మట్టెలు అందజేత
మంచిర్యాల జిల్లా : నిరుపేద కుటుంబానికి మేమున్నామంటూ వారికి చేయూత నిచ్చుటకు జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు హృదయంతో ముందుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ కాచిగూడ జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ పటేల్ వారి సహకారంతో మండల అధ్యక్షులు అగ్గి సత్తయ్య పటేల్ ఆధ్వర్యంలో కాసిపేట గ్రామానికి చెందిన పేద మున్నూరుకాపు కులానికి చెందిన కీ.శే పెద్దపల్లి తిరుపతి- లక్ష్మి దంపతుల కుమార్తె చి.ల.సౌ ప్రణీత వివాహానికి పుస్తే మట్టెల తో పాటు పెళ్లి చీరలను బుధవారం రోజున బహుకరించిన మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్ట లక్ష్మణ్ పటేల్ కాసిపేట మండల అధ్యక్షులు అగ్గి సత్తయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రాకం సంతోష్ పటేల్, కాసిపేట మండల నాయకులు ఉష్కమల్ల గోపాల్ పటేల్, మడిపల్లి తిరుపతి పటేల్, పెద్దపల్లి శంకర్ పటేల్, కాసు సురేందర్, గుర్రాల వేణు పటేల్, తో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు.