మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో రంగ 36వ వర్ధంతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా మండలంలో కాపు ముద్దుబిడ్డ బెజవాడ బెబ్బులి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మున్నూరు కాపు సంఘ నాయకులు మాట్లాడుతూ7 ఏళ్ల రాజకీయాలలో ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ పేదలకు ఇళ్ల పట్టాలు కోసం రంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో కిరాయి మూకలు హత మార్చడం తద్వారా అయన మరణాంతర నుండి ఇప్పటికి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు, రంగా ఏ ఒక్క కులానికి చెందిన వారు కాదని అయన అన్ని కులాలకు ఆరాధ్యదైవమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నాయకుడికి లేనంతగా సుమారు 2లక్షలపై విగ్రహాలు ఉన్న ఏకైక ఒకే ఒక్క రంగా అని, మేము మిమ్మల్ని చూడకపోయినా చరిత్రకే చెమటలు పట్టించిన మీ చరిత్ర చెబుతుంది మీ గురించి, మీ ఆశయాలు ఎప్పటికి మా గుండెల్లో పదిలంగా ఉంటాయి అని తెలిపారు. కంటితో నిన్ను చూడలేకపోయిన,మా గుండెల్లో నింపిన ఆశయం మా కడ శ్వాస వరకు బ్రతికే ఉంటుంది మున్నూరుకాపు కుటుంబ సభ్యులు, సంఘ నిర్వాహకులు తెలియజేశారు.